Search
Monday 21 May 2018
  • :
  • :

రైతులందరికీ బీమా

ckr

 ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది
 రైతు మరణిస్తే కుటుంబం దిక్కులేనిది కావొద్దు
 రైతుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ వర్తింపు
 రైతులు, వారి నామినీల జాబితాను తయారుచేయండి
 అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

సంక్షేమంలో ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ జీవిత బీమా వర్తించేలా నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. కుటుంబంలోని రైతు ఏ కారణంచేత మృతిచెందినా ఆ కుటుంబం మొత్తం దిక్కులేనిదిగా ఉండరాదని, రాష్ట్రంలోని రైతులందరికీ ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ సౌకర్యం కల్పించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసి (జీవిత బీమా కార్పొరేషన్) ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే పథకంపై చర్చించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

మన తెలంగాణ / హైదరాబాద్ : అనేక సంక్షేమ పథకాల్లో యావత్తు దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ జీవిత బీమా వర్తించే విధంగా నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. కుటుంబంలోని రైతు ఏ కారణంచేత మృతిచెందినా ఆ కుటుంబం మొత్తం దిక్కులేనిదిగా ఉండరాదని, రాష్ట్రంలోని రైతులందరికీ ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ సౌకర్యం కల్పించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసి (జీవిత బీమా కార్పొరేషన్) ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వరకు జీవిత బీమా సౌక ర్యం కల్పించే పథకంపై చర్చించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణ యం యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్య క్తం చేశారు. మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పిం చే విషయంలో ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పథకం ఏ విధంగా అమలుకావాలనే అంశమై అధికారులతో పాటు ఎల్‌ఐసి ప్రతినిధులతో విపులంగా చర్చించారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయనున్నట్లు సిఎం స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధుల్ని రాష్ట్ర వార్షిక బడ్జెట్ నుంచే కేటాయిస్తామని స్పష్టం చేశారు. దేశంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)కి పెద్ద నిర్వహణా యంత్రాంగం ఉందని, భారత ప్రభుత్వరంగ సంస్థగా దీని పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, అందువల్ల ఆ సంస్థ ద్వారానే తెలంగాణలో రైతుల బీమా పథకాన్ని అమలుచేయాలని స్పష్టం చేశారు. ఈ పథకం దేశంలోనే మొదటికి కావడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతుల్లో వివిధ వయసులకు చెందినవారు ఉన్నందున ఎల్‌ఐసి రూపొందించిన పాలసీల నిబంధనలు ఎలా ఉన్నయో, తెలంగాణ రైతుల అవసరాలను తీర్చే బీమా పథకం ఎలా ఉండాలో విస్తృతంగా అధ్యయనం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. గ్రామాలవారీగా, మండలాలవారీగా రైతుల జాబితాతో పాటు బీమా పథకంలో పెట్టాల్సిన నామినీల జాబితాను కూడా రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

కుదుటపడుతున్నది…

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన వ్యవసాయ రంగం కుదుటపడుతోందని సిఎం వ్యాఖ్యానించారు. రైతులు వివిధ రకాలుగా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. రైతులు ఏ కారణంరీత్యా మృతి చెందినా ఆ కుటుంబం దిక్కులేనిదిగా మిగిలిపోవద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులకు, ఎల్‌ఐసి ప్రతినిధులకు వివరించారు. చిన్న, సన్నకారు, పెద్ద రైతు అనే తేడా లేకుండా బీమా సౌకర్యాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని, ఇందుకోసం రైతులందరినీ సభ్యులుగా చేర్చి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సీనియర్ అధికారులు అజయ్‌మిశ్రా, పార్థసారధి, రామకృష్ణారావు, నర్సింగ్‌రావు, అదర్‌సిన్హా, శివశంకర్, జగన్‌మోహన్‌రావు, భూపాల్‌రెడ్డి తదితరులతో పాటు బీమా సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.

Comments

comments