Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

చెక్కులు… చిక్కులు

Ryth Bandhu Cheques Not Distribute In Navabpet

 ప్రభుత్వం రైతులు సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. తొలి దశ ఈ నెల వరకు  చెక్కులు పంపిణీ చేయాలి. కానీ గ్రామాల్లో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సుమారు 30 శాతం చెక్కుల పంపిణీ మిగిలిపోయాయి. దీంతో రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నవాబుపేట మండలంలో కొన్ని గ్రామాల్లో నేటికీ 70 శాతం  కూడా ‘రైతుబంధు’  చేపట్టకపోవడం గమనార్హం . గతంలో చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళనలో గ్రామాల్లోని సమస్యలు  పరిష్కరించామని అధికారులు చెబుతూ వచ్చారు. తీరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చూస్తే పేర్లన్నీ తప్పులు, అయోమయంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మనతెలంగాణ/నవాబుపేట: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశ ఈ నెల వరకు చెక్కులు పంపిణీ చేయాలి. కానీ గ్రామాల్లో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సుమారు 30 శాతం చెక్కుల పంపిణీ మిగిలిపోయాయి. దీంతో రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నవాబుపేట మండలంలో కొన్ని గ్రామాల్లో నేటికీ 70 శాతం కూడా రైతుబంధు పథకం కార్యక్రమాలు చేపట్టకపోవడం గమనార్హం . గతంలో చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళనలో గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించామని అధికారులు చెబుతూ వచ్చారు. తీరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చూస్తే పేర్లన్నీ తప్పులు, అయోమయంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెక్కులు, పాసుపుస్తకాలు అరకొరగా పంపిణీ….
కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులకు చెక్కులు వస్తే మరికొందరికి పట్టా పాసు పుస్తకాలు అందాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు వచ్చిన రైతులు పాసు పుస్తకాల్లో తప్పులను ఎప్పడు సరి చేసి ఇస్తారంటూ నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది రైతులు రికార్డుల్లో అన్నీ సవ్యంగా ఉన్నా చెక్కులు అందలేదని వాపోతున్నారు. రికార్డుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నా పాస్ పుస్తకం రాలేదు. చెక్కు మాత్రమే వచ్చింది, అధికారులు భూ దస్త్రాల ప్రక్షాళనలో గ్రామాల్లోకి వచ్చినప్పుడు భూమి పత్రాలకు సంబంధించిన జెరాక్స్‌లు అందించాం. పట్టా పాసు పుస్తకాలు ఎప్పుడు ఇస్తారోనని నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు త్వరగా తప్పులు సరిచేసి పుస్తకాలను అందించాలని మండల రైతులు కోరుతున్నారు.

Comments

comments