Search
Monday 21 May 2018
  • :
  • :

టిఎంసి, బిజెపి వర్కర్లపై లాఠీచార్జ్ ( వీడియో)

police-action-aimage

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో గురువారం పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రతిపక్ష నేతలు, కౌంటింగ్ ఏజెంట్లపై పలువురు దాడికి పాల్పడ్డారు. కౌంటింగ్ సెంటర్ నుంచి నేతలను, ఏజెంట్లను బయటకు వెళ్లగొట్టారు. తృణమూల్ కాంగ్రెస్ వర్కర్లు నార్త్ దినాజ్ పూర్ లో ఇద్దరిపైన కాల్పులు జరిపారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. రెండు రోజులు కిందట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విధ్వంసకాంఢ జరిగిన విషయం విదితమే. ఆ ఘటనల్లో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఈ రోజు ఓ కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీ గందరగోళం చోటుచేసుకుంది. దాంతో బిర్ బమ్ సెంటర్ వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టిఎంసి, బిజెపి కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల్లో దీదీ పార్టీ లీడింగ్ లో కొనసాగుతోంది.

Comments

comments