Search
Friday 25 May 2018
  • :
  • :

లింగ వివక్ష భారత్ లోనే ఎక్కువా

Sexual prejudice is very much in India

ప్రతి సంవత్సరం 2.39 లక్షల మంది ఐదేళ్ల లోపు ఆడపిల్లలు భారత దేశంలో వివిధ కారణాల వల్ల మరణిస్తున్నట్లు లింగ వివక్ష అధ్యయన విభాగం తెలుపుతోంది. ఈ సంఖ్య ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. అక్కడి ప్రజలు ఎక్కువగా మగ పిల్లలకే ప్రాధాన్యం ఇస్తున్నారట. భ్రూణ హత్యలు కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుందని ఆస్ట్రియా ఆధారిత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ నిర్వహించిన సర్వే తెలిపింది. ఈ మరణాలు కేవలం లింగ వివక్షతోనే జరగడంలేదు. వారు ఎలాంటి పరిస్థితిలో పుట్టుక జరిగిందో కూడా తెలుసుకోవాలని అధ్యయనకారుడు క్రిష్టోఫె గిల్మ్ ఓటో తెలిపారు. లింగ సమానత్వం అనేది కేవలం చదువులోనే కాదు, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యాల్లో, పిల్లల సంరక్షణలో, ఆడపిల్లల పోషణ, వారి మనుగడలో కూడా ఉండాలి. మూడింట రెండు వంతుల ఐదేళ్లలోపు ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో సంభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ మరణాల సంఖ్య 30.5 ఉండగా, బీహార్‌లో 28.5 ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో 22.1, 25.4 గా నమోదైంది. తక్కువ స్థాయి విద్య ఉన్న గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో, ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇంకా సంతానోత్పతి ఎక్కువగా ఉండి, ఆర్థికంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి.
పోషకాహారం, ఆరోగ్యంపై శ్రద్ధ విషయంలో బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో కొంతవరకు మరణాల సంఖ్య తగ్గవచ్చంటున్నారు పరిశోధకురాలు నందితా సైకియా. సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో, పితృస్వామ్య వ్యవస్థ మూలంగా, బాలికా సంరక్షణ మీద పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఈ మరణాలకు కారణాలని ఆమె చెప్పారు. కొడుకులే కావాలి అని కాకుండా అందరూ సమానమే అని భావించాలని సైకియా వెల్లడించారు. భారతీయ మహిళలు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే లింగవివక్షత సమస్యను పరిష్కరించుకోగలుగుతాం అని ఆమె వివరించారు.

Comments

comments