Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బీచ్‌లో ఒంటరి యువతిపై పోలీసుల దాష్టీకం..!(వీడియో)

Shocking moment a New Jersey cop punches a woman in the head during an arrest

న్యూజెర్సీ: సోషల్ మీడియాలో ఇప్పడో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బీచ్‌లో సేదదీరుతున్న ఓ యువతిని అదుపులోకి తీసుకునే క్రమంలో అక్కడి పోలీసులు ఆమెపై భౌతికదాడికి పాల్పడటం రికార్డైంది. ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించడంతో పోలీసులు యువతి తలపై బలంగా కొట్టడం మనం వీడియోలో చూడొచ్చు. ఎమిలీ వెయిన్ మన్ అనే 20 ఏళ్ల యువతి బీచ్‌లో అక్రమంగా మద్యం కలిగి ఉందనే కారణంతో పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ప్రతిఘటించడంతో ఓ అధికారి కాళ్లను గట్టిగా పట్టుకోగా, మరో అధికారి తలపై బలంగా కొడుతున్నట్టు వీడియోలో ఉంది. తానేమీ తప్పు చేయలేదని ఆమె చెబుతుండగా, చుట్టూ ఉన్నవారు పోలీసులకు ఎదురు తిరగొద్దు.. చెప్పినట్టు చెయ్యి అని యువతికి సూచించడం కూడా వీడియోలో వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన మొబైల్ ద్వారా తీసిన లెక్సీ దీన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఏకంగా 46 వేల షేర్లు సాధించడం విశేషం. అయితే యువతిపై పోలీసుల వైఖరిని తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు చేయడంతో ఘటనకు పాల్పడిన అధికారులపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Comments

comments