Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

స్మార్ట్ సిటీ సమ్మిట్‌లో అవార్డు అందుకున్న మేయర్

 Smart City Summit conducted in Surat

మన తెలంగాణ/కార్పొరేషన్: గుజరాత్ ప్రభుత్వం సూరత్‌లో నిర్వహించిన స్మార్ట్ సిటీ సమ్మిట్ కు హాజరైన మేయర్ నన్నపునేని నరేందర్ వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న మానవ వ్య ర్థాల శుద్ధీకరణ ప్లాంట్ నిర్వహణలో భాగం గా ఉత్తమంగా నిర్వహించిన వరంగల్ నగర పాలక సంస్థకు గుజరాత్ ప్రభుత్వం అవార్డు ఆ దివారం అందజేసింది. ఈ అవార్డును గుజరాత్ సిఎం విజయ్‌రూపానీ చేతుల మీదుగా మేయర్ నరేందర్‌కు అవార్డు అందజేశారు. దేశంలోనే మొదటి సారిగా మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు అత్యుత్తమంగా వరంగల్ నగరంలో నిర్వహించడం గొప్ప విషయమని గుజరాత్ సిఎం కితాబిచ్చారు. వరంగల్ నగరంలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్వహిస్తున్న సేవరైస్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటులను వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, కరీంనగర్ మేయ ర్ రవీందర్ సింగ్ కలిసి సందర్శించారు. ఈ ప్లాంట్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూ.85 కోట్ల పెట్టుబడితో వాటర్ అమ్మకం ద్వారా ఏడాదిలో ఆ మొత్తం పెట్టుబడిని సంపాదించిం ది. ఈ ప్లాంట్లను వరంగల్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేయడం జరిగిందని మేయర్ నరేందర్ తెలిపారు. నగరంలోని పార్క్‌లు, నిర్మా ణంలో ఉన్న భవనాలకు సరఫరా చేయడం గురించి ఆలోచిస్తున్నట్లు మేయర్ నరేందర్ అభిప్రాయపడ్డారు. -సూరత్‌లో నివసిస్తున్న తెలంగాణ వాసులకు సన్మానం
గుజరాత్‌లోని సూరత్‌లో బతుకు దెరువు నిమిత్తం నివసిస్తున్న తెలంగాణ వాసులు మేయర్ నరేందర్ సూరత్ పర్యటన సందర్బంగా మేయర్ నరేందర్‌ను వారు సన్మానించారు. ఈ సందర్భంగా సూరత్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకోవాల్సిందిగా వారు మేయర్‌ను కోరారు.
నగర అభివృద్ధికి తీసుకుంటున్న మెళకువలను సమావేశంలో వివరించిన మేయర్
వరంగల్ నగరంలో చేపడుతున్న అభివృద్ధిపై సూరత్‌లో జరిగిన సమావేశంలో మేయర్ నరేందర్ వివరించారు. నగరంలో ప్రవేశపెడుతున్న స్మార్ట్ సిటి, అమృత్ ఇతర పథకాలపై మేయర్ నరేందర్ వివరించారు. ముఖ్యమంత్రి అశురెన్స్ నుంచి రూ.300 కోట్ల నిధులతో నగరంలో చేపడుతున్న అభివృద్ధిని మేయర్ వివరించారు. నగరంలో 16 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడంలో తీసుకున్న నిర్ణయాలు, వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతూ టూరిజంలో నగరాన్ని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను మేయర్ ఈ సమావేశంలో వివరించారు.

Comments

comments