Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

స్టైలిష్ ఐకాన్

Sonam-Kapoor

పేరు : సోనమ్ కపూర్
పుట్టిన వివరాలు:1985 జూన్ 9 ముంబయి .
తల్లిదండ్రులు :‘మిస్టర్ ఇండియా’ అనిల్‌కపూర్, సునీతా కపూర్. చెల్లి రియా, నిర్మాత.
తమ్ముడు హర్షవర్థన్, నటుడు
చదువు : బి.ఏ., సింగపూర్‌లో థియేటర్ ఆర్ట్.
హాబీస్ : పుస్తకాలు చదవడం, షాపింగ్, వీడియో గేమ్స్,పెయింటింగ్స్‌సేకరణ, రచనా వ్యాసంగం.
తెరంగేట్రం: టీనేజ్‌లో ఊబకాయం వల్ల చిత్రాల్లో నటించడం కుదరదు అని అనుకుంది. సంజయ్ లీలా భన్సాలీ ‘బ్లాక్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసింది. భన్సాలీ తన ‘సావరియా’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆ పాత్ర కోసం 30 కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది.
పారితోషికం : 2 నుండి 3 కోట్లు.
అభిరుచులు: ‘లాటిన్’ డాన్స్ అంటే ప్రాణం. సంగీతం, కథక్‌లో శిక్షణ పొందింది. ఏ సబ్జెక్టు మీదైనా బాగా రాయగలదు.
గుర్తింపు : కేన్స్ చిత్రోత్సవంలో ఇప్పటి వరకు ఏడు సార్లు రెడ్ కార్పెట్ పై నడిచింది. ‘లారియల్’ వంటి కాస్మొటిక్ కంపెనీలకు బ్రాండ్  అంబాసిడర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటు భారతీయ వస్త్రాల్లో, అటు వెస్ట్రర్న్ దుస్తుల్లో అందరి మెప్పు పొందింది. జాతీయ అవార్డు గ్రహీత స్టైల్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది.

పెళ్లి : స్నేహితుడు ఆనంద్ ఆహుజాతో మే 8న ముంబయిలో జరిగింది. ఆహుజా పారిశ్రామిక వేత్త. 1983 ఢిల్లీలో జన్మించాడు. తల్లిదండ్రులు బీనా ఆహుజా, సునీల్ ఆహుజా.

తండ్రి బాటలోనే నడిచి నటీమణి అయింది. తర్వాత తనదైన శైలితో సినీ రంగంలో దూసుకుపోతోంది సోనమ్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గారాల కుమార్తె, కథానాయిక సోనమ్ కపూర్ వివాహ వేడుక బాంద్రాలోని రాక్‌డేల్ హోటల్ లో 8, మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల మధ్యలో ఈ శుభకార్యం జరిగింది. బాలీవుడ్‌లో స్టైలిష్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన సోనమ్ పెళ్లి కుమార్తెగా అందంగా కనిపించింది. అంచనాలకు తగ్గట్టు సోనమ్ పెళ్లి కుమార్తె లుక్‌లో నెటిజన్లను ఫిదా చేశారు. ఎరుపు రంగు లెహెంగా, భారీ నగలతో మెరిశారు.

పెళ్లి కుమారుడు ఆనంద్ ఆహుజా గోల్ షేర్వానీలో కనిపించారు. కుటుంబ సభ్యులు అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, హర్షవర్ధన్ కపూర్, బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తోపాటు సినీ ప్రముఖులు కరీనా కపూర్, సైఫ్‌అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్వరా భాస్కర్, కరణ్ జోహార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను దీవించారు.ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి. సోనమ్ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌తో గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై సోనమ్ ఎప్పుడూ స్పందించలేదు. ఎట్టకేలకు వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని కుటుంబ సభ్యులు వారం క్రితం ప్రకటించారు. ఇన్నాళ్ళు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న సోనమ్ పెళ్లి తరువాత మంచి భార్యగా పేరు తెచ్చుకుంది.

కేన్స్‌లో మెరిసిన సోనమ్

ఫ్రాన్స్ లో 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక వైభవంగా కొనసాగుతోంది. మే 8న మొదలైన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని విభిన్నమైన దుస్తులతో హొయలొలికించారు. ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుకకు నవ వధువు సోనమ్ కపూర్ హాజరయ్యారు. . అచ్చం పెళ్లి కూతురులాగే జుట్టు అల్లుకుని జడకుచ్చులు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.  కేన్స్ వేడుక అనంతరం సోనమ్ తన భర్త ఆనంద్‌తో కలిసి కొన్ని రోజులు ఫ్రాన్స్‌లోనే విహరించనుంది. సోనమ్ తన తండ్రి అనిల్‌కపూర్ తో కలిసి ‘ఏక్ లడికీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో నటించనుంది.

Comments

comments