Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : స్పీకర్

 Speaker  Said people welfare is the government goal
మనతెలంగాణ/మొగుళ్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల అబివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్షం అని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం మండలంలోని రంగాపురం గ్రామాల్లో పల్లె నిద్ర చేసిన స్పీకర్ మంగళవారం ఉదయం గ్రామంలోని అన్ని కూడళ్ళలో బైక్‌పై పర్యటించి ప్రజలను సమస్యలపై క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే రంగాపురం నుంచి జూకల్లు, రేపాక, హైబోత్‌పల్లి గ్రామలకు వెళ్ళే రోడ్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. జూకల్లు వెళ్ళే దారిలో రోడ్డు ఇరువైపుల ముండ్ల పొదలు (తుమ్మచెట్లు) పెరగడంతో వాటి తొలగింపుకు తన స్వంతంగా రూ.10వేలు ఇస్తానని గ్రామాస్తులకు తెలిపారు. ఎస్సీ కాలనీలో పర్యటించిన స్పీకర్‌కు కాలనీ వాసులు తమకు డుబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించాలని అడగడంతో ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే 50ఇండ్లు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. రంగాపురం పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధీ పనులను పరిశీలించి కూలీలతో కలిసి ఉపాధీ పనిలో బాగంగా మట్టితట్ట మొసి పని చేశారు. అనంతరం సీతరామచంద్రస్వామి దేవాలయంలో స్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా విలేఖరుల సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు సేవ చేసే బాగ్యం కల్గించడం అదృష్టంగా భావిస్తున్నరన్నారు. రాష్ట్రంలోనే నియోజకవర్గానికి గడిచిన 4 సంవత్సరాలలో….. 60సంవత్సరాలు పాలించిన పాలకుల కంటే అత్యదికంగా నిధులు తీసుకువచ్చి అన్ని రంగాలలో అబివృద్ధి చేసానని తెలిపారు. కూలీ కార్మీకులకు ఉపాధీ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అందిస్తూ పాటుపడుతుందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను దష్టిలో పెట్టుకోని ఉపాధీ హమీ పథకానికి నిధులు కేటాయిస్తూ అండగా నిలుస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలను సమైక్యాద్ర పాలకులు పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణాలకు నియోజకవర్గానికి సుమారు 30కోట్ల నిధులు మంజూరయ్యాయని, మండలంలోని రంగాపూర్ గ్రామం నుండి చలివాగు, మొట్లపల్లి నుంచి పర్లపల్లి, మెట్‌పల్లి నుంచిమర్రిపల్లిగూడేం వరకు రోడ్ల నిర్మాణాలకు నిదులు మంజూరైనట్లు ప్రకటించారు. పల్లె ప్రగతి నిద్ర చేసిన గ్రామాలను నా జీవితంలో ఎప్పటికి మరిచిపోలేనని ఉద్ఘాటంగా తెలిపారు. పల్లె నిద్రలో బాగంగా అనేక సమస్యలు ప్రజలు నాదృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, పరకాల మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, శాయంపేట మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, టిఆర్‌ఎస్ నాయకులు వర్దెల్లి రాజేశ్వర్‌రావు, రవీందర్‌రావు, వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సుధీర్ సర్పంచ్‌లు చంద్రమౌళి, తిరుపతి, ఓదేలు,రాములు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Comments

comments