Search
Monday 21 May 2018
  • :
  • :

నాకు ఎయిడ్సా? చనిపోయానా?

Sri Reddy files a Complaint over Vulgar Posts on her in Social Media

హైదరాబాద్: ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి తనతో పాటు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న కొంత మందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఎయిడ్స్‌తో చనిపోయిందంటూ కొంతమంది యూట్యూబ్‌లో ఫోటోలు, వీడియోలు పోస్టు చేశారు. మరికొందరు ఆత్మహత్య చేసుకుందని పోస్టులు పెట్టారు. వీటిపై స్పందించిన ఆమె తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే కొంతమంది ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. తనపై పోస్టులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సిసిఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇదిలాఉంగా తాజాగా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో… ‘ఒక్కొక్కడి తాట తీస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి. ఇప్పటి వరకు 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా’ అని రాసుకొచ్చింది.

Sri-Reddy

Comments

comments