Search
Friday 25 May 2018
  • :
  • :

కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి పోటా పోటీ

karimnagar-image

అధికార పార్టీలో వీడని సందిగ్ధం
కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ
చివరి రోజు 12 నామినేషన్లు దాఖలు
ఎంపికకు ఎమ్మెల్యే, మేయర్ నిర్ణయమే ఫైనల్
నేడు పరిశీలన 20లోపు ఉపసంహరణ, 23న ఎన్నికలు

మన తెలంగాణ/ కరీంనగర్ టౌన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో స్టాం డింగ్ కమిటీ సందడి మొదలైంది. నగరంలో 50మంది కార్పొరేటర్లున్న ఐదుగురికి మాత్రమే స్టాండింగ్ కమిటీలో చోటు దక్కనుంది. స్టాండింగ్ కమిటీలో ఎలాగైనా చోటు దక్కించుకోవడానికి అధికారపార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. నగర మేయర్, డిప్యూటీ మేయర్, ఇప్పటికి జిల్లా ప్రణాళికా సంఘంలో చోటు దక్కించుకున్న ఇద్దరు కార్పొరేటర్లను మినహాయిస్తే మిగతా 22మంది ఊహల పల్లకిలో ఊగుతున్నారు. స్టాండింగ్ కమిటీలో తమకంటే తమకు అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌లను నామినేషన్ వేసిన సభ్యులు అభ్యర్థిస్తున్నా రు. ఇది చివరి అవకాశంవల్ల ఐదు పోస్టులు ఉండడం వలన అందరూ పార్టీ పెద్దల చుట్టూ తిరగక తప్పడం లేదు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుండి 24మంది గెలుపొందగా ఇతర పార్టీల నుండి వచ్చిన మరికొంత మం ది కార్పొరేటర్లు తమకు న్యాయం చేయలంటూ కోరుతున్నారు. చివరి అంకం కావడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార పా ర్టీకి చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. ఏకగ్రీవం చేయాలంటే తెరాస పార్టీ పెద్దలకు తలనొప్పి మారిగాంది.

ముగిసిన నామినేషన్ దాఖలు గడువు: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల గడువు బుధవారంతో ముగిసింది. మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినుషన్ల కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి పోటా పోటీ పరిశీలన జరుగనుంది. 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 23 నగర పాలక సంస్థలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

నామినేషన్ దాఖలు చేసిన సభ్యులు వీరే: నగర పాలక సంస్థలో ఐదు స్టాండింగ్ కమీటి సభ్యులకు పోటీనెలకొనగా బుధవారం గడువలోగా మొత్తం 12 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మంగళవారం అధికార పార్టీకి చెందిన 11 వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల రవీందర్ , ఎంఐఎం పార్టీకి చెందిన 7 వ డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ లు నామినేషన్లు వేశారు. బుధవారం చివరి రోజు కావడంతో వివిద డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల రజిత (17 డివిజన్). కంసాల శ్రీనివాస్ (05 డివిజన్), కొడూరి రవీందర్ గౌడ్ (27 డివిజన్), తాటి ప్రభావతి (23డివిజన్), నేతికుంట కళావతి (20 డివిజన్), పెద్దపల్లి రవీందర్ కుమార్ (36 డివిజన్), బండారి వేణు (47 డివిజన్), మహ్మద్ మాజీద్ హుస్సేన్ (39 డివిజన్), గూడూరి శారద (22 డివిజన్), యాదగిరి సునీల్ రావు (31 డివిజన్)లకు చెందిన వారు నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీందర్ సింగ్‌ల నిర్ణయమే కీలకం
నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నిల అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌ల నిర్ణయమే ఫైనలు కానుంది. నామినేషన్ దాఖలు చేసిన సభ్యులు వీరి ఆమోదం పొందేందుకు వారి వద్దకు వెళ్లి నాకు ఆవకాశం కల్పించాలంటు కోరుతున్నారు. 12 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార పార్టీలో వీడని సందిగ్ధ్దం నెలకొంది.

Comments

comments