Search
Monday 21 May 2018
  • :
  • :

ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి

int

జకర్తా: ఇండోనేషియాలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. సురాబయా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పపడ్డారు. ఈ  దాడిలో 7మంది మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం సురాబయాలోని 3 చర్చిల్లో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారంతా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Comments

comments