Search
Monday 21 May 2018
  • :
  • :

వృద్ధ దంపతుల ఆత్మహత్య

housene-wife-image

హుజూరాబాద్: జీవితం విరక్తి చెందిన వృద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నంపల్లి గ్రామంలో వెంకట నర్సయ్య(85), కస్తూరి లక్ష్మీ నర్సవ్వ(80)లు నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలోనే వీరు గత కొంతకాలంగా మనోవేధనతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందినట్లు వారు తెలిపారు.

Comments

comments