Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రషీద్ వన్ మ్యాన్ షో..

Sunrisers Hyderabad reached final

కోల్‌కతా: ఐపిఎల్ పదకొండో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వాలిఫయర్2లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్ ధోని సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతుంది. కోల్‌కతా పోరులో రషీద్ ఖాన్ ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయం సాధించి పెట్టాడు. ముందు బ్యాట్‌తో, తర్వాత బంతితో చెలరేగిన రషీద్ హైదరాబాద్‌కు ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డింగ్‌లోనూ రాణించి కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టాడు. దీంతో వన్ మ్యాన్ షోతో రషీద్ సన్‌రైజర్స్‌ను టైటిల్ పోరుకు చేర్చాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రషీద్ 10 బంతుల్లోనే నాలుగు భారీ సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో అజేయంగా 34 పరుగులు చేశాడు. అంతేగాక, 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఇక, ఆదివారం ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఫైనల్లో హైదరాబాద్, చెన్నై జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి.
శుభారంభం…
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు క్రిస్ లిన్, సునిల్ నరైన్‌లు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగారు. నరైన్ తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. ధాటిగా ఆడిన నరైన్ స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో కోల్‌కతా లక్షం దిశగా అడుగులు వేసింది. చెలరేగి ఆడిన నరైన్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో 3.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. అయితే ప్రమాదకరంగా మారిన నరైన్‌ను కౌల్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన నితీష్ రానా కూడా ధాటిగా ఆడాడు. లిన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కోల్‌కతా లక్షం దిశగా అడుగులు వేసింది.
రషీద్ మాయా…
ఈ దశలో రషీద్ ఖాన్ అద్భుత ఫీల్డింగ్‌తో నితీష్ రానాను రనౌట్ చేశాడు. ధాటిగా ఆడిన రానా రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప (2)ను కూడా రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు కెప్టెన్ దినేష్ కార్తీక్‌ను సాకిబ్ ఔట్ చేశాడు. ఇక, రాజస్థా

న్‌పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ (3) రషీద్ పెవిలియన్ బాట పట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లిన్ పోరాటం కొనసాగించాడు. అయితే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసిన లిన్‌ను కూడా రషీద్ ఔట్ చేశాడు. దీంతో కోల్‌కతా ఆశలు అడుగంటాయి. చివర్లో శుభ్‌మన్ గిల్ కాస్త పోరాటం కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ధాటి గా ఆడిన గిల్

రెండు ఫోర్లు, ఒక సిక్స్ 30 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి కోల్‌కతాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
మెరుపు ఇన్నింగ్స్…
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సాహా ఐదు ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ధావన్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. కెప్టెన్ విలియమ్సన్ (3) నిరాశ పరిచాడు. అయితే చివర్లో రషీద్ ఖాన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన రషీద్ 10 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో అజేయంగా 34 పరుగులు చేశాడు. సాకిబ్ (28), హుడా (19) తమవంతు పాత్ర పోషించడంతో హైదరాబాద్ స్కోరు 174 పరుగులకు చేరింది.

Comments

comments