Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

కష్టాల్లో సన్‌రైజర్స్.. 18 ఓవర్లలో 115/6

chenn

ముంబయి: ఐపిఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌లు తడబడుతున్నారు. చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.ఓపెనర్లు శిఖర్ ధావన్(0), గోస్వామి(12) ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(24), యూసుఫ్ పఠాన్(24), షకిబ్(12), మనీష్ పాండే(8) అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో బ్రాత్‌వైట్(24), భువనేశ్వర్(7)లు ఉన్నారు.

Comments

comments