Search
Monday 21 May 2018
  • :
  • :

సిద్ధిపేటకు మెడికల్ కాలేజీ

Telangana Gets Medical College Sanctioned For Siddipet

ఢిల్లీ : తెలంగాణలోని సిద్ధిపేట మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 150 సీట్లతో 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీ ప్రారంభం కానుంది. సిద్ధిపేట మెడికల్ కాలేజీకి అనుమతి రావడంపై మంత్రి తన్నీరు హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్రం 13 మెడికల్ కాలేజీలకు అనుమతిచ్చింది. అందులో ఒక కాలేజీని సిద్ధిపేటలో ప్రారంభించనున్నారు.

Telangana Gets Medical College Sanctioned For Siddipet

Comments

comments