Search
Friday 25 May 2018
  • :
  • :

‘రైతు’బంధుతో పండుగ

ph1

 భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్(గజ్వెల్) : రైతుబంధు పథకమే రైతన్నలకు పెద్ద పండుగా అని, ప్రతి రైతు రైతుబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండంలంలోని బురుగుపల్లి గ్రామంలో రైతుబంధు చెక్కులు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బురగు పల్లి గ్రామంలో ఇప్పటి వరకు రూ.2 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఊరి ప్రజలు ఒక్కతాటిపై వచ్చి రైతుబంధు పండుగా జరుపు కోవడం ఎంతో సంతోషమని అన్నారు. రైతుబంధు పధకం కింద సిద్దిపేట జిల్లాలో రూ.236 కోట్లు అందు కున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను రైతులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సూచించారు. బిజెపి ప్రభు త్వం ధాన్యం కొను గోలులో చెతులె త్తిసిన రూ.1000 కోట్లు వెచ్చించి కందులను కొనుగోలు చేశారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గజ్వెల నియెజక వర్గం దేశానికే ఆదర్శం అని అన్నారు.

దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రం

kadiyam

తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజును చేయాలనే లక్షంతో విప్లవాత్మకమైన ఆలోచన చేసిన రైతు బాంధవుడు కేసీఆర్ అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విఫ్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో బుధవారం జరిగిన రైతుబంధు కార్యక్రమంలో రైతులకు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వహించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్ర పాలనలో పాలకులు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని దేశంలో కాంగ్రెస్, బిజెపి, సిపిఎం అధికార రాష్ట్రాలలో రైతుకోసం ఇలాంటి పథకాలు అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం ఆలోచించి వినూత్నమైన కొత్త పథకాలను రూపకల్పన చేసి, దేశంలోనే ఆదర్శం గా నిలిచిందన్నారు. జనగామ ఎమ్యెల్యేగా ఉండి భారీ నీటి పారుదల శాఖ మంత్రి గా ఉండి ఇక్కడ  పని చేసిన పొన్నాల లక్ష్మయ్య ఎప్పుడైనా చెరువులను నిం పాలని, రైతులకు పెట్టుబడి ఇవ్వాలని  వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్  ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచలేక  అవస్థలపాలు చేశారని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments