Search
Friday 25 May 2018
  • :
  • :

సినీ రచయిత ఆత్మహత్యాయత్నం

Telugu Film Author Suicide Attempt at Mumbai

ముంబయి : సినీ రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజసింహా ముంబలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 2016లో సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రాన్ని రాజసింహా తెరకెక్కించాడు. అనంతరం శంకర్ దాదా ఎంబిబిఎస్, బొమ్మరిల్లు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు , రుద్రమదేవి సినిమాలకు రచయితగా పని చేశారు. సంబరం, స్నేహం, టక్కరిదొంగ వంటి చిత్రాల్లో నటించారు. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు సంభాషణలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా రాజసింహాకు సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి పోయిన ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ముంబయిలోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Telugu Film Author Suicide Attempt at Mumbai

Comments

comments