Search
Monday 21 May 2018
  • :
  • :

రైతు కష్టాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం

The goal of the government is to satisfy the farmers' hardship

మనతెలంగాణ/లక్షెట్టిపేట రూరల్: తెలంగాణ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చే ప్రభుత్వమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నా రు. మండలంలోని తిమ్మాపూర్, ఎల్లారం గ్రామాల్లో గురువారం  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో రైతుల కష్టాలు అంతా ఇంతా కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రైతులకు కష్టం అనేదే లేకుండా పోయిందన్నారు. పంట దుక్కి దున్ని నారు వేసిన నాటినుండి రైతులకు అవసరం ఉన్న అన్ని సౌకర్యాలను మన తెలంగాణ ప్రభుత్వం కలుగజేస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంట దళారుల చేతిలో మోసపోకూడదన్న దృఢ సంకల్పంతో అందుబాటులో ఎన్నో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఈసంవత్సరం నుండి రైతులు అప్పు చేసి సాగు చేయకూడదన్న సదుద్ధేశంతో రెండు పంటలకు సంవత్సరానికి ఎకరాకు ఎనిమిది వేలు అందించే పథకం కూడా నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నరు. రైతులు ఈ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రఖకర్ రావు గారికి ఋణపడి ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పేదల కోసం, రైతుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏరాష్ట్రంలో ఏదేశంలో కూడా లేవన్నారు. అనంతరం రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలతో పాటు పంట సాగు పెట్టుబడి చెక్కులను నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అదికారిణి శ్యామలాదేవి, శిశు సంక్షేమశాఖ చేర్మన్ అత్తి సరోజ, రైతు సమన్యయ కమిటి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, జడ్పీటిసి చుంచు చిన్నయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, డిసిఎమ్మెస్ చేర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి ప్రభాకర్, సర్పంచ్ బియ్యాల లావణ్య సుధాకర్, ఆకుల రాజేశ్వరి సత్తయ్య, ఎంపిటిసిలు గడుసు స్వప్న రమేష్, పార్టీ మండల అద్యక్షుడు పోడేటి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.

Comments

comments