Search
Monday 21 May 2018
  • :
  • :

నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య

The woman threw kerosene on her chest and suicide her

లక్షెట్టిపేట: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కట్ల సత్తవ్వ(35) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందినట్టు ఎస్ఐ మధుసుధన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… సత్తవ్వకు గత పదకొండు సంత్సరాల క్రితం వివాహంకాగా పది సంవత్సరాల క్రితం భార్య భర్తల మధ్య మనస్పర్థాలతో విడాకులు కూడా అయ్యాయన్నారు. విడాకులు అయిన సమయం నుండి మృతురాలు మానసికంగా బాధపడుతుండేదని కుటుంబికులు తెలిపారని అదే క్రమంలో ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించుకోవడంతో గమనించిన స్థానికులు లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మరణించిందన్నారు. మృతురాలికి భర్త పిల్లలు లేరని తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Comments

comments