Search
Monday 21 May 2018
  • :
  • :

మహిళను బెదిరించి నగలు దోచుకున్న దుండగులు

Thieves attack with Knife on Woman

సూర్యాపేట : పాత సూర్యపేట గ్రామ సమీపంలో ఉన్న చెలకలో పత్తి కట్టెను తొలగిస్తున్న ఒంటరి మహిళను  గుర్తు తెలియని దుండగులు బెదిరించి నగలు ఎత్తికెళ్లిన సంఘటన జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే తమ చెలకలో పత్తి కట్టెను తొలగించేందుకు వెళ్లిన గునగంటి నాగమ్మ వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. చుట్టుపక్కల ఎవరు లేరని గమనించిన దుండగులు ఆమెను కత్తులతో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న దిద్దులు బుట్టాలు, పట్టీలను దోచుకెళ్లారు. సుమారు వాటి విలువ రూ. 32 వేలు ఉంటుందని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. ఇటీవల ఇలాంటి దొంగతనం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కల్లు తాగుతామని వచ్చిన వ్యక్తులు మహిళ కంట్లో కారం చల్లి ఆమె నగలను కూడా ఎత్తుకెళ్లిన సంఘటన మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడంతో మండలంలోని మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల క్రితమే దొంగతనం జరిగిందని పోలీసులకు తెలిపినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments