Search
Monday 21 May 2018
  • :
  • :

దొంగల ముఠా అరెస్టు

Thieves Gang Arrested in Rangareddy

రంగారెడ్డి : ఉప్పరపల్లిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు గల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన దొంగల నుంచి రూ.42.87 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అదేవిధంగా హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని చెబుతూ ఈ ముఠా ప్రజలను మోసం చేస్తోంది. సినిమా, వ్యాపార రంగాలకు చెందిన వారిని ఈ ముఠా మోసం చేసింది. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు.

Thieves Gang Arrested in Rangareddy

Comments

comments