Search
Monday 21 May 2018
  • :
  • :

ఒకనాటి క్లర్క్ నేడు ముఖ్యమంత్రి

 third time Yeddyurappa took over as chief minister

బెంగళూరు : ఆయన వివాదాల ముద్దు బిడ్డ. వివాదాలు ఆయన రాజకీయ ప్రయాణంలో  వెన్నంటి నడిచాయి. చివరకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం లో చట్టబద్ధ పోరా టం వరకు వివాదాలు సాగాయి. ఒకప్పుడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్క్ గా పని చేసి, తరువాత హార్డ్‌వేర్ దుకాణం యజమాని స్థాయి నుంచి ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఆయన పేరే యడ్యూరప్ప. ఆయన ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం ఇది మూడోసారి కావడం విశేషం. కర్నాటక సిఎంగా మూడోసారి పదవి చేపట్టిన బూకనకెరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప వయసు 75 యేండ్లు. ఆయన తన 25వ యేటనే  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. బిజెపి అనుబంధ సంస్థ జనసంఘ్‌తో తన రాజకీయ రంగ ప్రవేశానికి తన జన్మస్థలమైన శివమొగ్గ జిల్లా శికారిపురలో మార్గం వేసుకున్నారు.యడ్యూరప్ప 1983 లో తొలిసారి శికారిపుర నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బిఎ పట్టా పొంది న యడ్యూరప్ప ఎమర్జన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 2014లో బిజెపి ఆయనకు గురుతరమైన బాధ్యతని అప్పజెప్పింది. 2014 లో నిర్వహించిన కర్నాటక అసెంబ్లీలో ఆయన సారథ్యంలోని బిజెపి ఎక్కువ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా నిలిచింది. యడ్యూరప్ప సిఎం కావడం తప్పనిసరి అని అంతా భావించారు. కాని కాంగ్రెస్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ జెడి ఎస్ పార్టీలు అలియన్స్‌గా మారాయి.

దీంతో ధరమ్ సింగ్ ముఖ్యమంత్రిగా కాం గ్రెస్, జెడి ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ సమయంలో యడ్యూరప్ప హెచ్‌డి దేవెగౌడ కొడుకైన హెచ్‌డి కుమారస్వామితో చేతులు కలిపాడు. అదే సమయంలో మైనింగ్ స్కాంలో ధరంసింగ్ పాత్ర ఉందని లోకాయుక్త  ప్రకటించడంతో ఆయన రాజినామా చేశారు. కుమారస్వామితో చేతులు కలిపిన యడ్యూరప్ప విడతల వారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఒప్పందం చేసుకున్నారు.  దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా,యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2007లో యడ్యూరప్ప తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2008, మేలో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా..లోకాయుక్త సంతోష్ హెగ్డే యడ్యూరప్పని మైనింగ్ కేసులో నిందితుడని తేల్చి వేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేశారు. ఇన్ని వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా యడ్యూరప్పనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ఎన్నికల్లో ప్రచారం చేసింది. చివరికిఎన్నికల్లో  బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆయన సిఎం పదవిని చేపట్టారు.

Comments

comments