Search
Friday 25 May 2018
  • :
  • :

మరో మల్టీస్టారర్‌కు సన్నాహాలు

This picture of Ram Charan and Dulquer Salmaan

ఈమధ్య కాలంలో మల్టీస్టారర్ కథలకు మన హీరోలు కొత్త అర్థం చెబుతున్నారు. అభిమానులకు కొత్త తరహా అభిరుచిని పరిచయం చేయాలని ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే… రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే చరణ్ మరో హీరోతో కలిసి ఓ మల్టీస్టారర్‌ను చేయబోతున్నట్లు తెలిసింది. అతను ఎవరో కాదు ఇటీవల ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా తర్వాత దుల్కర్‌కు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయట. ఈ నేపథ్యంలో త్వరలో కె.ఎస్.రవిచంద్రన్ తెరకెక్కించే సినిమాలో రామ్‌చరణ్-దుల్కర్ సల్మాన్ కలిసి నటించబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఆ చిత్రంపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక రామ్‌చరణ్‌కు మలయాళంలో కూడా మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమాతో అతను పక్క ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమా తాజాగా 200 కోట్ల కలెక్షన్లను దాటడం విశేషం.  ఇక రవిచంద్రన్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్… బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు.

Comments

comments