Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఫైనల్ బెర్త్ ఎవరిదో..?

today Sunrisers Hyderabad match with Rajasthan Royals

నేడు కోల్‌కతాతో హైదరాబాద్ అమీతుమీ

పటిష్టంగా కోల్‌కతా..

కోల్‌కతా: ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజ స్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవారం సన్‌రైజర్స్ హైదరా బాద్‌తో జరిగే క్వాలిఫయర్2 పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయ ర్1లో చేజేతులా ఓటమి పాలైన హైద రాబాద్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా మారింది. కోల్‌కతాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఒత్తిడి నెలకొంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలుకావడం సన్‌రై జర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. టైటిల్ పోరుకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఓడితే ఇంటిదారి పట్టక తప్పదు. దీంతో ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. కాగా, బౌలింగ్‌లో హైదరాబాద్, బ్యాటింగ్‌లో కోల్‌కతా బలంగా కనిపి స్తున్నాయి. మొదటి క్వాలీఫ యర్ మ్యాచ్‌లో చెన్నైపై సన్‌రై జర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. అయితే కీలక సమయంలో బ్రాత్‌వైట్ ఒత్తిడికి గురికావడంతో గెల వాల్సిన మ్యాచ్‌ను హైదరా బాద్ చేజార్చుకుంది. కాగా, ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని హైదరాబాద్ భావిస్తోంది. ఇందు కోసం పటిష్టమైన వ్యూహంతో బరిలోకి దిగనుంది. కోల్ కతా కూడా ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకుంది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై భారీ విజయం సాధించడంతో జట్టులో కొత్త జోష్ వచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా మారింది.

లీగ్ దశలో కోల్‌కతా గెలిచిన మ్యాచ్‌లన్నీ బ్యాటింగ్ బలంతోనే విజయం సాధించింది. నైట్‌రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్ భీకర ఫాంలో ఉండి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ ఐపిఎల్‌మ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన దినేశ్ 490 పురగులతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా మరో ఆటగాడు క్రిస్‌లీన్ 443 పరుగులతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్, అండర్19 ఆటగాడు శభ్‌మన్‌గిల్‌లు ఫాంలో కొనసాగుతున్నాడు. ఇండోర్ వేదికగా కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ఏకంగా 245 పరుగులు చేసి అతిధ్య జట్టయిన పంజాబ్‌కు చుక్క చూపించారు. ఈ మ్యాచ్‌లో 31 పరుగులతో విజయం సాధించిన విషయం విధితమే. ఈ ఫాంను ఇలాగే కొనసాగితే కోల్‌కతా ఫైనల్‌కు చేరుకోవడం సులభమే అనడంతో సందేహం లేదు.
రైజర్స్ వేధిస్తున్న బ్యాంటింగ్..
ఈ ఐపిల్ సీజన్‌లో అంజనాలకు మించి రాణిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాటింగ్ సమస్య వేధిస్తుంది. సారథి కేన్ విలియమ్సన్, ఓపెనర్ శిఖర్ ధవన్ తప్పా మిగివారంతా ఫెవిలియన్‌కు దారికడుతున్నారు. భారీ స్కోరు సాధించే బ్యాట్స్‌మెన్స్ యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, షకిబ్ ఉల్ హసన్, వృద్ధిమాన్ షా పెద్దగా పరుగులు చచేయకుండానే వెనుదిరుగున్నారు. ఈ సీజన్ యూసుప్ పఠాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ సీజన్ 13 మ్యాచ్‌లాడిన పఠాన్ 212 పరుగులు మాత్రమే చేసి 34వ స్థానంలో ఉన్నాడు. కాగా సారథి విలియమ్సన్ 685 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే నేడు కోల్‌కతాతో జరిగే రెడ్ క్వాలిఫయర్ మ్యాచ్ రాణిస్తే సన్‌రైజర్స్‌కు గెలుపు లాంఛనయే..
సొంత మైదానంలో..

kolkata

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన నైట్‌రైడర్స్ బుధవారం రాజస్థాన్ రాయల్స్‌ను నిష్క్రమింప( ఎలివేట్) చేసింది. కాగా ఐపిఎల్ ఫైనల్‌లో మూడోసారి కోల్‌కతా జట్టు ప్రవేశించకుండా చేయాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తుచేయాల్సి ఉంది. కానీ ముంబయి నుంచి వచ్చి ఈడెన్ గార్డెన్స్‌లో ఆడబోయే సన్‌రైజర్స్‌కు ఇది కష్టసాధ్యమేననిపిస్తోంది. ముంబయి వికెట్ బౌన్సర్‌కు అనుకూలమైతే, ఇక్కడి ఈడెన్ గార్డెన్ పిచ్ స్పిన్‌కు అనుకూలమైంది. పైగా ఇది కోల్‌కతా జట్టుకు స్వంత మైదానం. వారికి ఆటలో అనుకూలించే అవశాలెక్కువ. అయినప్పటికీ కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ జట్టును తక్కువ అంచనా వేయడంలేదు. లీగ్ స్టేజి వరకు అగ్రశ్రేణిలో నిలిచిన సన్‌రైజర్స్ తర్వాత అంతగా రాణించలేదు. ‘ గత మ్యాచ్‌ల గెలుపోటముల గురించి మేము యోచించడం లేదు. వారు వరుసగా నాలుగు ఓటములు చవిచూశారా, మేము వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చామా అన్నది ఇక్కడ ప్రధానం కాదు. మా తదుపరి మ్యాచ్ మాకు చాలా ముఖమైనది. ఇది నాకౌట్ దశ. ఇకపై ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమైనదే’ అని కుల్‌దీప్ యాదవ్ అన్నాడు.

సన్ రైజర్స్‌కు అంత సులువు కాదు

రెండుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపిఎల్ క్వాలిఫయర్2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించి తీరుతుందన్న ధీమాను కోలకతా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ వ్యక్తం చేశాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యా చ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 25 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన క్వాలిఫయర్1లో చైన్నై సూపర్‌కింగ్స్(సిఎస్‌కె) చేతిలో స్వల్ప స్కోరు తేడాతో పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం క్వాలిఫయర్2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొనడానికి సిద్ధం గా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లోనే శుక్రవారం జరిగే ఈ కాలిఫయర్2 మ్యాచ్ నేపథ్యంలో కుల్‌దీప్ నాయర్ మాట్లాడుతూ ‘ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆడి ఇక్కడికి వచ్చిన సన్‌రైజర్స్ ఈ వికెట్‌పై ఆడటం చాలా కష్టం. ఈడెన్‌గార్డెన్స్ మా సొంత మైదానం. స్పిన్ కు అనుకూలమైనది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే సన్‌రైజర్స్‌తో జరిగే క్వాలిఫయర్2లో నిస్సందేహంగా విజయం మాదే అవుతుంది. గత మ్యాచ్‌ల గెలుపోటముల గురించి ఇ ప్పుడు ఆలోచించను. తదుపరి మ్యాచ్‌లో గెలిస్తేనే నిలిచేది లేకుంటే నిష్క్రమణే. ఇ ప్పుడు మేము నాకౌట్ స్టేజ్ లో ఉన్నాం. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే విజేత కాగ లం’ అని చెప్పాడు.

Comments

comments