Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

గెలిస్తేనే నిలుస్తారు…

rajasthan

నేడు ఎలిమినేటర్ పోరు, కోల్‌కతాతో సమరానికి రాజస్థాన్ రెఢీ

కోల్‌కతా: ఐపిఎల్ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్ధమైంది. ఐపిఎల్ ట్రోఫీ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ మ్యా చ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగనుంది. దీంతో సొంత గడ్డపై ఆడుతున్న కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కోల్‌కతా 8 మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోగా, రాజస్థాన్ అనూహ్యంగా ఈ బెర్త్ దక్కించుకుంది. కీలక ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లు లేకుండానే రాజస్థాన్ మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు కోల్‌కతా జట్టు చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలువాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా బలంగా ఉంది. ఓపెనర్లు క్రిస్ లిన్, సునిల్ నరైన్‌లు జోరుమీదున్నారు. రాబిన్ ఉతప్ప, ఆండి రసెల్, కెప్టెన్ దినేష్ కార్తీక్‌లు కూడా మెరుగ్గా ఆడుతున్నారు. బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో కోల్‌కతా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.
సమష్టిగా పోరాడాలి…
ఈ మ్యాచ్‌లో గెలవాలంటే రాజస్థాన్ తన ఆటను ఎంతో మెరు గు పరుచుకోక తప్పదు. బట్లర్ లేక పోవడం జట్టుకు పెద్ద లోటుగా చెప్పవచ్చు. రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరిందంటే దానికి కారణం బట్లరే. పలు మ్యాచు ల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ఆడేందుకు బట్లర్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని లోటును భర్తీ చేయడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. ఇక, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సేవలను కూడా రాజస్థాన్ కోల్పోయింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన స్టోక్స్ కూడా జాతీయ జట్టుకు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లి పోయాడు. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే రాజస్థాన్ పోరుకు సిద్ధమైంది. రాహుల్ త్రిపాఠి, సంజు శాం సన్, క్లాసెన్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన శాంసన్ విజృంభిస్తే రాజస్థాన్‌కు గెలుపు నల్లేరుపై నడకే. త్రిపాఠి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ అజింక్య రహానె వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. ఈ సీజన్‌లో రహానె పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా రహానె తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాలి. క్లాసెన్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగక తప్పదు. కృష్ణప్ప గౌతమ్, ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఐష్ సోధి తదిరులతో రాజస్థాన్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. బౌలర్లు సమష్టిగా రాణిస్తుండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఈసారి కూడా కలిసికట్టుగా ఆడి కోల్‌కతాకు చెక్ పెట్టాలని రాజస్థాన్ భావిస్తోంది.
బ్యాటింగే బలం…

kolkata
రాజస్థాన్‌తో పోల్చితే బ్యాటింగ్‌లో కోల్‌కతా చాలా బలంగా ఉంది. ఓపెనర్లు క్రిస్ లిన్, సునిల్ నరైన్‌లు పలు మ్యాచుల్లో జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశ లే పెట్టుకుంది. ఇద్దరు చెలరేగితే మరోసారి శుభారంభం లభించ డం ఖాయం. అయితే నిలకడలేమి ఇద్దరికి ప్రతికూలంగా మారిం ది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే తర్వాతి మ్యాచ్‌లో విఫలం కావడం ఇద్ద రు అలవాటుగా మార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని కోల్‌కతా ఓపెనర్లు ఉన్నారు. కిం దటి మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప కూడా ఫాంలోకి వచ్చాడు. ఉతప్ప విజృంభిస్తే అడ్డుకోవడం ఎంతటి బౌలర్‌కైనా కష్టమే. ఈ మ్యాచ్‌లో ఉతప్ప జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. హైదరాబాద్‌పై అద్భుతంగా ఆడిన కార్తీక్ ఎలిమినేటర్‌లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను చెలరేగితే జట్టుకు భారీ స్కోరు ఖాయం. రసెల్ కూడా గాడిలో పడ్డాడు. దీంతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

Comments

comments