Search
Friday 25 May 2018
  • :
  • :

గెలుపే లక్ష్యంగా..!

hyd

జోరుమీదున్న సన్‌రైజర్స్..

నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ

బెంగళూరు : ఈ ఐపిల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగే లేకుండా పోయింది. ఆ జట్టు ఆడిన 12 మ్యాచుల్లో 9 గెలువగా 3 ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన రైజర్స్ నేడు బెంగళూరుతో తలపడనుంది. జట్టులో శిఖర్ ధవన్, సారథి విలియమ్సన్ ఫాంలో కొనసాగుతూ పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే కేన్ విలియమ్సన్ 544 పరుగులతో అత్యధిక పరుగుల సాధించిన బ్యాట్మెన్ల వరుసలో మూడో స్థానంలో కొనసాగుతుండగా ధవన్ 369 పరుగులతో 14వ స్థానంలో ఉన్నాడు. వీరితో పాటు మనీశ్‌పాండే, వృద్ధిమాన్ సాహా వంటి బ్యాట్సమెన్లు కూడా రాణిస్తున్నారు. అంతేకాకుంగా బౌలర్లు బంతితో ప్రత్యర్థి బ్యాట్మెన్లను బహడలెత్తిస్తూ.. పురుగలు ఇవ్వకుడంఆ కట్టడి చేస్తున్నారు. పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ రషీద్‌ఖాన్, మరో స్పిన్నర్ షకిబ్ హసన్ కూడా బంతితో చెలరేగుతూ జుట్ట విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో సన్‌రైజర్స్ జుట్టు సమతూకంగా ఉండి విజపరపర కొనసాగిస్తోంది.
మొదటి నుంచి అదే తీరు…

Today is Bangalore match with Hyderabad

ఐపిఎల్ మొదటి నుంచి బెంగళూరు ఛాలెంజర్స్ పేలవ ప్రదర్శనలు ఇస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ స్టార్ బ్యాట్‌మెన్లు ఉన్నా ఆ జట్టు పరిస్థితి మారలేదు. కోహ్లీ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటికి 12 మ్యాచ్‌లాడింది. కాగా 5 మ్యాచుల్లో గెలిచి, 7 మ్యాచుల్లో ఓటమిని మూటగట్టుకొంది. -౦.218 నెట్ రన్‌రేట్‌తో పాటిపట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎబి డెవిలియర్స్, బ్రెండన్ మెకుల్లమ్, పార్థీవ్ పటేల్, డీకాక్ టీమ్ సౌథీ వంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన బెంగళూరు జట్టు ఓటములను చవిచూస్తుండటం బాధకరమైన విషయం. ఈ జట్టు యాజువేంద్ర చహాల్, ఉమేవ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్స్ ఉన్నా ప్రత్యార్థి బ్యాట్స్‌మెన్ల ముందు తేలిపోతున్నారు. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్ ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే!
అందరి చూపు కోహ్లిపైనే..
బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లిపైనే అందిరి చూపు ఉంది. జట్టు విజయాలతో సంబంధం లేకుండా కెప్టెన్‌గా తనవంతు బాధ్యతను నిర్వహిస్తూ ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 514 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక ఇన్నింగ్ 92 పరుగులు సాధించిన విరాట్ ఇదే అతనికి ఈ సీజన్‌లో అత్యుత్తమం. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును కోహ్లీ సాధించాడు. అదేంటంటే… ఐపీఎల్‌లో ఐదు సీజన్లలో 500లకు పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీ. ఇది ఐపీఎల్ చరిత్రలో రికార్డు. అంతేకాదు కోహ్లీ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ సీజన్‌లో అతడి పరుగుల సంఖ్య 514కి చేరింది. 2011లో మొదటిసారి కోహ్లీ మొదటిసారి 557(16 మ్యాచ్‌లు) పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2013లో 634(16 మ్యాచ్ లు), 2015లో 505(16 మ్యాచ్‌లు), 2016లో 973(16 మ్యాచ్‌లు) పరుగులు చేశాడు. ఈ సీజన్‌కు ముందు కోహ్లీతో పాటు డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్) నాలుగుసార్లు 500లకు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ప్రతి సీజన్లోనూ 300లకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడికి నిలిచాడు. రైనా 2010, 2013, 2014లో 500పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్లో లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.

Comments

comments