Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results Declared

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 78.24 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఫార్మసిసీ అండ్ అగ్రికల్చర్‌లో 90.72 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,36,311 మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు 66,857 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు 16,646 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ టాప్‌టెన్‌లో అయ్యపు వెంకటపాణి ఫస్ట్ ర్యాంక్ సాధించగా, గట్టు మైత్రేయ సెకెండ్ ర్యాంక్, గోకుల వినాయక శ్రీవర్ధన్ మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. మే 25 నుంచి కౌన్పెలింగ్ ప్రారంభం అవుతుంది. జూలై మొదటివారంలో రెండో విడత కౌన్సెలింగ్ ఉండనుంది. జూలై 16 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి శ్రీహరి తెలిపారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాల వారిగా ర్యాంక్స్ వివరాలు ఇలా ఉన్నాయి…

ఇంజనీరింగ్ విభాగంలో: ఫస్టు ర్యాంక్ – వెంకటపాణి వంశీనాథ్ (రంగారెడ్డి), రెండో ర్యాంక్  -మైత్రేయ (రంగారెడ్డి), మూడో ర్యాంక్ – శ్రీవర్థన్ (రంగారెడ్డి), నాల్గో ర్యాంక్ – హేమంత్ కుమార్ (వైజాగ్), ఐదో ర్యాంక్ – మదన్ మోహన్ రెడ్డి ( కృష్ణాజిల్లా), ఆరో ర్యాంక్ – భరత్ (శ్రీకాకుళం).

అగ్రికల్చర్‌ విభాగంలో: మొదటి ర్యాంక్ – నమ్రత (కర్నూలు), రెండో ర్యాంక్ – సంజీవ్ కుమార్ రెడ్డి, మూడో ర్యాంక్ – ఆర్యన్ (నిజామాబాద్), నాల్గో ర్యాంక్ – సంజన (మేడ్చల్).

TS EAMCET Results Website1

TS EAMCET Results Website2

Comments

comments