Search
Monday 21 May 2018
  • :
  • :

జెడిఎస్ తోనే మేము… మిస్సింగ్ ఎమ్మెల్యేల స్పందన…

JDS-LOGO
బెంగళూరు: కర్నాటకలో బుధవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి జెడిఎస్ చెందిన 38 మంది ఎమ్మెల్యేలలో 36 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప, నాదగౌడలు డుమ్మా కొట్టడం సంచలనం రేపింది. దీంతో జెడిఎస్ నేతలు  బిజెపి వలలో పడ్డరేమోనని ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యే స్పందించారు. తాము ఎక్కడికి పోలేదని, కుమారస్వామికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బెంగళూరుకు తాము 450 కిలోమీటర్లు దూరం లో ఉన్నామని సూచించారు. అందుకే సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్య కూడా దీనికి ఒక కారణమన్నారు. తాము బిజెపిలో చేరబోమని వారు తేల్చిచెప్పారు. ఎన్నటికి జెడిఎస్ లోనే ఉంటామని స్పష్టం చేశారు.

Comments

comments