Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

2019 ఎన్నికల్లో విజయం మాదే: ఎంఎల్‌ఏ డా.జి. చిన్నారెడ్డి

Victory in 2019 elections: MLA Chinnareddi

మన తెలంగాణ /వనపర్తి కలెక్టరేట్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎంఎల్‌ఎ డా.జి. చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ డా.జి. చిన్నారెడ్డి ధర్నాలో మాట్లాడుతూ. కర్నాటక ఎన్నికల సమయంలో బిజెపి ప్రతి ఓటుకు డబ్బు పంచిందన్నారు. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఓటుకు నోటు అందించడం దారుణమన్నారు. గవర్నర్‌గా వజూబాయ్ వాలాగతంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పని చేశారన్నారు. బిజెపి పార్టీకి, నరేంద్రమోడిలకు సపోర్ట్ చేయడం విడ్డూరమమన్నారు. యడ్యూరప్పను సిఎంగా చేసేందుకు గవర్నర్ ఉత్సాహాన్ని ప్రదర్శిం చారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎంఎల్‌ఎ డా.జి. చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బల నిరూపణ కోసం 15 రోజులు సమయం ఇవ్వగా ఎడ్యూరప్ప సిఎంగా ప్రమాణం చేయడం బిజెపికి భయం పుట్టిందన్నారు.కేంద్ర ప్రభుత్వం కర్నాటకలో రాజ్యాంగాన్ని కూనీ చేసిందన్నారు. దేశం మొత్తంలో కాంగ్రెస్ నిరసనలు, ధర్నాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కర్నాటక గవర్నర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేక చేసి ధర్నాను విరమించారు. ధర్నాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, ప్రధానకార్యదర్శి తిరుపతయ్య, మహిళా నాయకురాలు ధనలక్ష్మీ,పట్టణా ధ్యక్షులు కిరణ్‌కుమార్,రాగివేణు, రవి, సహదేవ్‌యాదవ్, కృష్ణబాబు, విజయలక్ష్మీ, ఖమ్మర్‌మియ్యా,అక్తర్, ఎండి.బాబా, నాగన్నయాదవ్, అబ్దుల్లా,జాన్, వెంకటేశ్వర్‌రెడ్డి ,కుమార్, వెంకటేష్‌లు ఉన్నారు.

Comments

comments