Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

మంచినీటి కోసం జీపి ముందు ధర్నా

 Villagers Strike For Drinking Water in Kuravi

మన తెలంగాణ/కురవి : మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు బిందెలతో కురవి గ్రామ పంచాయతీ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ కురవి గ్రామ పంచాయతీ 1, 2వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు గత నెల రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి, సర్పంచుకి తెలియజేసినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. దళితులు నివసించు వార్డుపై చిన్న చూపు చూస్తున్నారని, కనీసం రోడ్డు కూడా సరిగాలేదన్నారు. వీధిలైట్లు లేక అంధకారంలో బ్రతుకుతున్నామని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా బల్లెం ఉప్పమ్మ, చంద్ర, పద్మ, వెంకటమ్మ, శంకర్, లక్ష్మణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments