Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

వివొ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు…

vivo-offers

ముంబయి: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివొ భారత్ లోని వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వివొ ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో బుధవారం వివొ నాకవుట్ కార్నివాల్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్  మే 18వ తేదీ వరకు ఉండగా ఇందులో పలు వివొ ఫోన్ల ధరలు భారీ తగ్గింపుకు లభిస్తున్నాయి. వివొ నాకవుట్ కార్నివాల్ సేల్ లో వివొ వి5 ప్లస్, వి5ఎస్ ఫోన్లు వరసగా రూ.14,990, రూ.12,900 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో ఎస్ బిఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లును కొనుగోలు చేేసిన వారికి అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. దీంతో పాటు రూ.1 వేయి విలువైన లక్కీ డ్రా కూపన్లు, రూ.500 విలువైన బుక్ మై షో కపుల్ సిన్మా వోచర్లు లభిస్తాయి.

Comments

comments