Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అటవీశాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

vali-ball-game-image

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ :  పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం టైగర్‌కప్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వమించా రు. మారుమూల గ్రామాల్లోని యువకులను చైతన్య పర్చడం కోసం అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతగా ఫ్రెండ్లీ ఫారెస్టులో భాగంగా కాగజ్‌నగర్ డివిజన్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎఫ్‌ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ అన్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని ఎనిమిది జట్లు పాల్గొన్నాయని, మురలిగూడ జట్టు చేడ్వాయి జట్టుపై గెలుపొంది డివిజన్ స్థాయికి అర్హత సాధించిందని తెలిపారు. త్వరలో డివిజన్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి మొదటి బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10వేలు, తృతీయ బహుమతి రూ. 5వేలు  అందించనున్నట్లు ఎఫ్‌డీవో నర్సింహరెడ్డి తెలిపారు. డివిజన్‌లోని ఏడు మండలాల్లో అన్ని గ్రామాల్లోని యువకులకు ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లు పంపిణి చేసి మండల స్థాయిలో టోర్నిలో నిర్వహించి డివిజన్  స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిం చి బహుమతులు అందజేస్తామని తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  డీఎఫ్‌ఓ లక్ష్మణ్ రంజిత్ నాయ క్, ఎఫ్‌డీఓ నర్సింహరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ వేణుగోపాల్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, తిరుమల్‌రావు, సుబాన్‌గౌరీ, ఎఫ్‌బీఓలు మోతిలాల్, గిరిబాబు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చౌదరి తిరుపతి, చేడ్వాయి స ర్పంచ్ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు నగునూరి శ్రీనివాస్, ఫారెస్టు సిబ్బంది, మండలంలోని యువకులు తది తరులు పాల్గొన్నారు.

Comments

comments