Search
Monday 21 May 2018
  • :
  • :

ఆటోను ఢీకొన్న ఓల్వో బస్సు…

Volvo bus collided to auto

భూత్పూర్ : మండల పరిధిలోని అన్నసాగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆటోను ఓల్వో ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌తోపాటు మొత్తం 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ మహిళకు చేయి పూర్తిగా తెగిపోయింది. వారంతా రైతుబంధు చెక్కులను తీసుకుని తిరుగుప్రయాణంలో పనులు ముగించుకుని సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వివరాల్లోకి వెళ్తే భూత్పూర్ నుంచి జానంపేటకు వెళ్తున్న ఆటోలో మంగలి రాకేష్ , జాంగీరమ్మ జనంపేట, శ్రీనివాసులు పోల్కంపల్లి, సత్యం , నాగమ్మ , నాగమణి, అన్నసాగర్, దేవరమ్మ, శంకర్ కనకాపూర్ తండా, సుంకరి జయమ్మ , హన్మంతు , కావలి వెంకటమ్మ , తుపలన్న రావులపల్లి, వీరంతా జానంపేటకు చెందిన బాల్‌రాజు ఆటోలో స్వగ్రామాలకు వెళ్తుండగా అన్నసాగర్ సమీపంలో భూత్పూర్ నుంచి జానంపేటకు వెళ్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్తున్న ఓల్వో బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో అధికంగా మహిళలు ఉన్నారు. ఆటో డ్రైవర్ బాలరాజు, చంద్రమ్మ, జాంగీరమ్మ పరిస్థితి ఆందోళనగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌హెచ్‌ఒ శ్రీనివాసులు క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

comments