Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

తడారిపోయిన లక్నవరం

Water released to the crops under is now without water

నాడు జలకళ నేడు వెలవెల
తగ్గిన పర్యాటకుల సందడి

మనతెలంగాణ/గోవిందరావుపేట : వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండల పరిధిలోని లక్నవరం సరస్సు తడారి పోయింది గతంలో సరస్సులో జలకళ ఉట్టిపడేది. కాగాలక్నవరం సరస్సు కింద పంటలకు నీరు విడుదల చేయగా ప్రస్తుతం సరస్సులో నీరు లేకుండా పోయింది. దీంతో సరుస్సులో నీరు లేక వెలవెలబోతున్నాది. జూలై నెలలో భారీ వర్షాలు పడడంతో సరస్సు భారీ ఎత్తున వర్షపునీరు చేరి చుట్టు గుట్టల మధ్య ఉండే సరస్సు పచ్చటి పర్యావరణంలో పక్షుల కిలకిల రాగాలను వినుకుంటు పర్యాటకులు ప్రకృతి పర్యావరణాన్ని ఎంతో ముచ్చటగా ఆస్వాదించడం జరుగుతుంది. సరస్సులోని ఉయ్యాల వంతెన ప్రక్కనే ఉన్న కాకర కాయల బోడుపై పర్యాటకులు విడిది చేసేందుకు హరిత హోటల్ మరోబోడు వద్ద అద్దాల కాటేజీలు ఉడెన్ కాటేజిల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు లక్నవరం సరస్సు కాటేజీలను 15 రోజుల ముందే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోడం జరిగేది.

పర్యాటకులు పిల్ల పాపలతో లక్నవరం సరస్సులో రెండు పెద్ద బోట్లు పై సరస్సులో విహరించేవారు.అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ఫెస్టి వల్ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థులు ట్రెకింగ్, జంగల్ సఫారి, ఎడ్ల బండ్ల పై ప్రయాణం చేసి రాత్రి వేళ గుడారాల్లో బస చేయడం జరిగేది. ఆదివారం, పండుగ సెలవులు, పాఠశాలల సెలవులు వచ్చాయంటే లక్నవరంలో సందడిగా ఉండేది. రోజుకు సుమారు 3వేల నుంచి 4వేల మంది పర్యాటకులు విహరించేవారు. 2016 లో గోవిందరాపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెటింగ్ గిడ్డంగుల ప్రారంభోత్సవం సందర్భంగా రైతుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సరస్సును సందర్శించారు. అనంతరం సరస్సు తూముల లీకులను అరికట్టెందుకు మరిన్ని నిధులు కేటాయించి దేవాదుల లైన్ సరస్సులోకి మల్లిస్తే సరస్సు కింద రైతులకు రెండు పంటలకు నీరు సమృద్ధిగా ఉంటుందని మరొవైపు పర్యాటక కేంద్రానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుందని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. అది అమలైతే లక్నవరం లోని నీటిని రైతులు ఉపయోగించకుండా ఉంటారని పర్యాటకులకు కూడ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని స్థానిక ప్రజలు, పర్యాటకులు కొరుతున్నారు.

Comments

comments