Search
Friday 25 May 2018
  • :
  • :

ఉపాధిని సాగుకు జత చేయాలి

ktr

బీమా రైతుకు ధీమా ఇవ్వాలి
రైతుబంధుతో భరోసా
24 గం. కరెంట్ ఇస్తున్నది మనమే
ఇల్లంతకుంట సభలో కెటిఆర్

మన తెలంగాణ/ సిరిసిల్ల/ఇల్లంతకుంట : రైతులకు అందించే బీమా.. వారికి ధీమాగా ఉండాలని, ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ఐటి, మున్సిపాల్ శాఖమంత్రి కెటి రామారావు కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేశామని, కానీ ఇప్పుడు ఇల్లంతకుంట సభ వేదికగా కేంద్రాన్ని అడుగుతున్నానని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం ‘రైతుబంధు’ చెక్కులు, పట్టదార్ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎరువుల, విత్తనాల కోసం క్యూ కట్టెవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయన్నారు. రైతుబంధు పథకంపై ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, భట్టివిక్రమార్క ఇద్దరు తలోమాట మాట్లాడుతున్నారని, ప్రజలు వీరి అసత్య మాటలను నమ్మలేకనే వాళ్లను అధికారం నుండి దూరం చేశారన్నారు. దాదాపు 86ఏండ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాల చేపట్టి , రాష్ట్రంలో 60లక్షల మంది రైతులకు కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు అందించామన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రితో పాటుగా కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బీటి రోడ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా మౌలిక వసతులన్ని కూడా తీర్చుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పిచైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments