Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రమాదాల నివారణకు చర్యలేవీ..?

What are the steps to prevent accidents?

టిపిసిసి రాష్ట్ర  కార్యదర్శి  గిరి కొండల్ రెడ్డి

మన తెలంగాణ/నంగునూరు : రాజీవ్ రహదారిపై గత నెల రో జులుగా రోజుకో నలుగురైదురుగు ప్రమాదాల రూపేణా చనిపోతుంటే ప్రభుత్వం, సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం సిగ్గు చేటని  టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు. బుధవారం మండల కేం ద్రమైన నంగునూరులో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు. ప్రతి రోజు ఎదో ఒక ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు పోతుంటే నివారణ చర్యలు చేపట్టకపోవడం నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనమనీ పేర్కోన్నారు. ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ స్వంత జిల్లాలోనే గత వారం రోజుల్లో నాలుగు సంఘటనలు జరిగితే స్పందించకపోవడంతో ప్రజల పై ఆయనకు ఉన్న ప్రేమ ఎంతదో అవగాతం అవుతుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమనీ గొప్పలు చెప్పుకొనే కేసిఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి కూతపెట్టు దూరంలోనే నాలుగైదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే కనీసం మానవత దృక్పద కోణంలో కూడ సంఘటన స్థలాలను సందర్శించడం కానీ, వారి కుటుంబికులను పలకరించకపోవడం బాధకరమైన విషయం అన్నారు. రాజీవ్ రహదారి పై అధిక బరువుతో, అధిక వేగంతో లారీల ప్రయాణం కొనసాగడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
రోడ్డు రవాణా శాఖ లంచాల మత్తులో జోగుతు ఇసుక మాఫియాకు కొమ్ము కాయడం మూలంగానే ఇలాంటి సంఘటనలు అధికమైతున్నాయన్నారు. దీనికి రవాణా శాఖ, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయాలైన వారికి 5 లక్షల పరిహారం అందిచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుంచు స్వామి, చెలికాని యాదగిరి, గడ్డం కర్ణకర్‌రెడ్డి, దేవులపల్లి రాజు, సియా జ్, సత్తయ్య, రాజిరెడ్డి, శ్రీకాంత్, కృష్ణ తదితరులు ఉన్నారు.

Comments

comments