Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేస్తోంది!

WhatsApp group video calling feature will be rolling out later this year

ప్రముఖ సోషల్ మీడియా మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల కాలంలో తన వినియోగదారుల కోసం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ తో కస్టమర్లను పలకరించబోతోంది వాట్సాప్. చాలాకాలంగా అందరూ ఎదురుచూస్తున్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎఫ్8 డెవలపర్ కాన్ఫిరెన్స్ లో ఫేస్ బుక్ తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా ఒక గ్రూపులోని పలువురు సభ్యులు వీడియో కాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఒఎస్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లలో 2.18.145 వెర్షన్ వాడుతున్న కస్టమర్లకు గ్రూప్ వీడియో కాల్‌ చేసుకొనే సౌకర్యం ఉంది. అలాగే ఐఒఎస్‌ ఆధారంగా పనిచేసే మొబైల్స్ వాడుతున్న వారు ఈ ఫీచర్ కోసం కోసం 2.18.52 వెర్షన్‌కు అప్‌డేట్ అయితే సరిపోతుంది. కానీ ఈ ఫీచర్ సౌకర్యం ఇప్పుడు కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా  త్వరలోనే ప్రతి వినియోగదారుడికి అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు.

Comments

comments