Search
Friday 25 May 2018
  • :
  • :

రైతుబంధు పథకంతో… రైతుల జీవితాల్లో వెలుగులు

With the farmer's scheme ... light up the peasant lives

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాళ్ల ఆధునీకీక రణతో చివరిఆయకట్టుకు
సాగునీరు
త్వరలోనే ఇంటింటికి మిషన్‌భగీరథ తాగునీరు
పట్టణంలోని 3,037 మంది రైతులకు 1కోటి 39లక్షల రైతుబంధు చెక్కులు
రైతబంధు చెక్కులు, పట్టా పాసు బుక్కుల పంపిణీలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

మన తెలంగాణ/మెదక్ టౌన్ : సీఎం కెసిఆర్ రైతులకు ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ రైతుబంధు ద్వారా అన్నదాతలను ఆదుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని సరస్వతి కాన్వెంట్ స్కూల్‌లో నిర్వహించిన రైతుబంధు పథకం కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పట్టణంలో గల 3,037 మంది రైతులకు గాను సగం మందికి పట్టా పాసుపుస్తకాలు, చెక్కులను ఉపసభాపతి పద్మాదేవేందరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ రైతులకు గాను రూ.1,39,67కోట్లను రైతుబంధు పథకం ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అందజేసిన చెక్కులను వృధా చేయకుండా కేవలం పంట సాగుకే వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. వచ్చే నెల 2, 6, 8వ తేదీల్లో చెక్కులను సూచించిన బ్యాంకులలో విడిపించుకోవాలని కోరారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అన్నదాతలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాం లో సాగునీరు సకాలంలో అందించక 40వేల ఎకరాల పంటకు గాను కేవలం 10వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేవన్నారు. సింగురు జలాలను మూడు దఫాలుగా విడుదల చేసి ఘనపురం ఆనకట్ట ద్వారా ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాళ్లకు లైనింగ్ చేసుకొని చివరి ఎకరా వరకు సాగునీరందిస్తున్నామన్నారు. సాగునీటితో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్లను ప్రతి నెల అందిస్తున్నామని, బోదకాలుతో బాధపడుతున్న వారికి కూడా త్వరలో నే పెన్షన్ అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్ళిలకు ఆర్థిక సహాయం, కెసిఆర్ కిట్టుతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు

Comments

comments