Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అక్షరం తప్పుతో… ఇంటర్వూ ఆగింది

 Wrong error in Kotaiah Certificate

ఏప్రిల్ 15న డిఆర్‌డిఎ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా నేటికీ నిర్లక్షమే
రిజర్వ్ బ్యాంకులో అటెండర్‌గా ఎంపికై అక్షర తప్పుతో ఆగిన ఇంటర్వూ
ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధృవీకరణ పత్రం అందజేయాలి

మన తెలంగాణ/భానుపురి : దళిత దివ్యాంగుడు చొప్పర కోటయ్య సదరం ధృవీకరణ పత్రంలో అక్షర తప్పు సరిచేయాలని సూర్యాపేట డిఆర్‌డిఎ అధికారులకు దరఖాస్తు చేసినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్షం చేయడం సరికాదని తెలంగాణ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు. మంగళవారం చొప్పర కోటయ్యతో కలిసి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఆర్‌డిఎ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకులో అటెండర్ ఉద్యోగంకు ఎంపిక అయ్యాడు. కానీ ధృవీకరణ పత్రంలో ఇంటిపేరు తప్పు ఉండడం వల్ల సరిచేసుకొని తీసుకురావాలని రిజర్వ్ బ్యాంకు అధికారులు చెప్పారు. బాధితుడు వెంటనే డిఆర్‌డిఎ అధికారులు దరఖాస్తు చేసుకోగా ఏప్రిల్ 15వ తేదీ నుండి ఇప్పటి వరకు నిర్లక్షం చేశారు. అతనికి వచ్చిన ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడిందని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అతని ఉద్యోగ విషయంలో తగు పత్రాలు వెంటనే జారీ చేసి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల పట్ల అధికారుల వైఖరి చాలా బాధాకరంగా ఉందని వెంటనే నిర్లక్ష వైఖరిని విడనాడి దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా పనిచేయుటకు తగు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

comments