Search
Friday 25 May 2018
  • :
  • :

అర్ధరాత్రి ఆర్డర్.. ఆర్డర్

suprem-court

న్యూఢిల్లీ : బిజెపి లీడర్  చేయడాన్ని అడ్డుకోబోమని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ యడ్యూరప్పని ఆహ్వానించడంతో చివరి ప్రయత్నంగా కాంగ్రెస్, జెడి ఎస్ పార్టీలు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై సుప్రీంని ఆశ్రయించాయి. కాంగ్రెస్,జెడి ఎస్ కూటమికి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నా గవర్నర్ తమని పిలువలేదని కోర్టుకు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మంది ఎమ్మెల్యేలు బిజెపికి లేకున్నా గవర్నర్ యడ్యూరప్పని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలువడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్, జెడి ఎస్ పార్టీ తరపును హాజరైన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా కేసుని విచారించాలని కోరారు. దీంతో అపెక్స్ కోర్టు పిటిషన్‌ని విచారణకు స్వీకరిస్తూ రాత్రి  2 గంటల 11 నిమిషాలకు విచారణ ప్రారంభించింది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం యడ్యూరప్ప మే 15,16 తేదీల్లో గవర్నర్‌కు రాసిన రెండు ఉత్తరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణలో ఇవి చాలా కీలకమైనవని తెలిపింది. యడ్యూరప్ప గవర్నర్‌కి రాసిన  లేఖలను కోర్టు ముందుంచాలని కేంద్రం తరపున హాజరైన అటార్ని జనరల్ కె.కె. వేణుగోపాల్‌నిఆదేశించింది. అసలు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా అని అటార్ని జనరల్‌ని బెంచ్ ప్రశ్నించింది.

ఒకవేళ జోక్యం చేసుకున్నట్లయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం లేదా అని ప్రశ్నించింది. యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ బల నిరూపణకు పదిహేను రోజులు గడువు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోలు జరిగే ప్రమాదం ఉందని, గతంలో బల నిరూపణకు కేవలం 48 గంటల సమయం మాత్రమే ఇచ్చారని  కాంగ్రెస్, జెడి ఎస్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి బెంచ్ దృష్టికి తెచ్చారు. అయి తే యడ్యూరప్ప, ప్రభుత్వం తరపున హాజరైన రోహత్గీ అర్థరాత్రి పిటిషన్ దాఖలు చేసిన తీరుని తప్పు పట్టా రు. ఒకరు ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన స్వర్గలోకం కిందికి దిగిరాదని ఆయన అన్నారు. ఇది చావు బతుకుల సమస్య కాదు కదా అని, ఎవరినైనా ఉరి తీయాల్సిన సమయం ఆసన్నం కాలేదు కదా అని చెప్పారు. అత్యధిక స్థానాలు సంపాదించిన పార్టీ లీడర్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించడం గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించిన అధికారమ ని ఆయన బెంచ్ దృష్టి తెచ్చారు. రాజ్యాంగబద్ధంగా అనుసరించే చర్యలను  కోర్టు అడ్డుకోలేదని, గవర్నర్‌ని ఆయన విధుల నుంచి ప్రక్కనపెట్టే అధికారం కోర్టుకు లేదని స్పష్టం చేశారు.కోర్టు  విచారణ తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాలకు ముగిసింది. విచారణని శుక్రవారం ఉదయం 10 గంటల 30లకి వాయిదా వేసింది.

Comments

comments