Search
Friday 25 May 2018
  • :
  • :

సిఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం

india

 తెరదించిన గవర్నర్

 పార్టీ బిజెపికే ఆహ్వానం 

 రాజ్యాంగ విరుద్ధం : భగ్గుమన్న కాంగ్రెస్

బెంగళూరు: ఉత్కంఠకు కర్నాటక గవర్నర్ తెరదించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపినే ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ వాజూభాయి వాలా బిజెపి శాసనసభా పక్షనేతగా ఎన్నికైన బిఎస్ యడ్యూరప్పకు బుధవారంనాడు రాత్రి సమాచారం అందించారు. దీంతో య డ్యూరప్ప కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా ప్ర మాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 9.30 గంటలకు యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీలో బల నిరూపణ కోసం యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల గడువు విధించారు. మంగళవారంనాడు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ సాధారణ మెజార్టీ రాలేదు. దీంతో 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, 38 స్థా నాలు గెలిచిన జెడి(ఎస్)కు మద్దతు ప్రకటించింది. సిఎంగా జెడిఎస్ అధినేత కుమారస్వామిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ సంసిద్ధత ప్రకటించిన నేపథ్యంలో కన్నడ రాజకీయం రసవత్తరంగా మారిం ది. ఈ నేపథ్యంలో రాజకీయం కర్నాటక రాజ్‌భవన్‌కు చేరడంతో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారి ంది. ఈ నేపథ్యంలో బుధవారంనాడు కూడా య డ్యూరప్ప, కుమారస్వామి ఇద్దరూ గవర్నర్‌ను కలి సి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ సమాధానమిచ్చారు. 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. కాంగ్రెస్, జెడిఎస్‌లకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సరిపడా మెజార్టీ ఉందని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చే యాలని కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. యడ్యూరప్పను ఆ హ్వానించినట్టు తమకు తెలిసిందన్నారు. సుప్రీంకో ర్టు తీర్పునకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చిదంబరం హితవుపలికారు. రా జ్యాంగ బద్ధంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని కాంగ్రెస్ మరోనేత నేత కపిల్ సిబల్ అన్నారు. ఆయన నిర్ణయం రా జ్యాంగ విరుద్ధమని, రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోం దో తమకు అర్థం కావట్లేదన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు.
ముందుగానే బిజెపి ట్వీట్ : కర్నాటక సిఎంగా యడ్యూరప్ప నియామకంపై బిజెపి తొందరపాటు గందరగోళానికి దారితీసింది. బిజెపి నేత యడ్యూరప్పను సిఎంగా ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారని, గురువారం ఉదయం 9.30గంటలకు కార్యక్రమం ఉంటుందని బిజెపి రా ష్ట్ర శాఖ ట్వీట్ చేసింది.

Comments

comments