Search
Monday 21 May 2018
  • :
  • :

యడ్యూరప్ప లేఖలు కోరిన సుప్రీంకోర్టు…

Centre Submits Cauvery Draft Scheme in Supreme Court

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన అంశంపై సుప్రీంకోర్టు గురువారం అటార్నీ జనరల్ కు కొన్ని ఆదేశాలను జారీచేసింది. 48 గంటల్లోగా సిఎం యడ్యూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించిన రెండు లేఖలను తమ ముందు ఉంచాలని అటార్నీ జనరల్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18వ తేదీన ఉదయం 10.30 నిమిషాల్లోగా అటార్నీ జనరల్ ఆ లేఖలు సుప్రీం ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన మే15వ తేదీ, అనంతరం మే 16వ తారీఖున యడ్యూరప్ప, గవర్నర్ వాజూభాయ్ వాలాకు రెండు లేఖలు రాశారు. తమ పార్టీకే బలముందని, తమకే ప్రభుత్వం ఏర్పాటు చేయాడానికి అవకాశం కల్పించాలని ఆయన లేఖల్లో గవర్నర్ ను కోరారు. ఈ లేఖల ఆధారంగా గవర్నర్ యడ్యూరప్పకు ఆహ్వానం పలికారు. అయితే జస్టిస్ ఎకె సిక్ర్కీ అధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతం ఆ లేఖలను పరిశీలించారలని కోరింది. గవర్నర్ ఈ లేఖల ఆధారంగా చేసుకొని యడ్యూరప్పకు ఆహ్వానం పలికారన్న అంశాన్ని పరిశీలించేందుకు ఆ లేఖలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. లేఖల్లో యడ్యూరప్ప తమ సమగ్ర సమాచారం ఇచ్చారా లేదా అన్న అంశాన్ని కోర్టు పరిశీలించాలని భావిస్తోంది. అసలు కాంగ్రెస్, జెడిఎస్ కూటమికి కాకుండా యడ్యూరప్పకు ఎలా అవకాశం కల్పించారన్న విషయాన్ని నిర్ధారించడానికే కోర్టు ఈ లేఖలను కోరింది. యడ్యూరప్ప వారం రోజులే కోరినప్పటికీ,  బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయం ఎందుకు ఇచ్చారని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మాను సింఘ్వీ ఫిర్యాదు చేశారు. ఒకవేళ బలపరీక్షలో యడ్యూరప్ప ఫేయిల్ అయితే ఏమతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారియా కమిషన్ రిపోర్టు మేరకు కూటమి పార్టీలకు తదుపరి అవకాశం దక్కుతుంది.  అనేక తీర్పుల్లోనూ సుప్రీం కోర్టు ఈ ఫార్ములానే వాడింది.

Comments

comments