Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

 రైలు ఢీకొని యువకుడు మృతి

Young man hit by train at janagoan

జనగామ క్రైం : జనగామ కాజీపెట్ రైల్వేలైన్‌లో ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన జనగామలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన బొల్ల నవీన్‌కుమార్ (25) అనే వ్యక్తి హైద్రాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు జనగామ నుండి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుండి జనగామ కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో హైద్రాబాద్‌కు వెళ్దామని స్థానిక రైల్వే స్టేషన్‌కు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి గుర్తుతెలియని రైలు ఢీకొని నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనగామ జీఆర్‌పీ పోలీసులు వెంకట్‌రెడ్డి, గణేశ్‌లు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించి, మృత దేహన్ని జనగామ ఏరియా ఆసుపత్రి మార్చూరికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు ఢీకొన్నట్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

comments