Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

నేటి నుంచి సాకర్ సంగ్రామం

2018 FIFA World Cup Russia

మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ సాకర్ టోర్నమెంట్ రానే వచ్చింది. రష్యా వేదికగా ఈ మెగా టోర్నమెంట్‌కు గురువారం తెరలేవనుంది. గ్రూప్‌ఎలో భాగంగా గురువారం సౌదీ అరేబియా, ఆతిథ్య రష్యాల మధ్య జరిగే మ్యాచ్‌తో 21వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభమవుతోంది. మొత్తం 12 నగరాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీ లో రష్యాతో సహా మొత్తం 32 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ఐదు సార్ల విజేత బ్రెజిల్, రెండేసి సార్లు చాంపియన్లుగా నిలిచిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. మాజీ విజేతలు స్పెయిన్, ఇంగ్లండ్, ఫ్రా న్స్‌లతో పాటు బెల్జియం, మెక్సికో, పోర్చుగల్, పోలండ్ తదితర జట్లు ట్రోఫీని గెలవడమే లక్షంగా పెట్టుకున్నాయి. ఈసారి కూడా యూరప్, అమెరికా దేశాల మ ధ్య హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన టోర్నమెంట్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ మాత్రమే. ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఫుట్‌బాల్ జ్వరం పట్టుకుంది. రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు ఇప్పటికే మంచి ప్రాచు ర్యం లభించింది. చాలా దేశాల అభిమానుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
కళ్లు చెదిరే ఏర్పాట్లు..
మాస్కోలోని చారిత్రక లుజినికి స్టేడియంలో గురువారం సాయంత్ర ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయేల ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించేందుకు రష్యా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు 500 మంది కళాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కళ్లు చెదిరే సాంస్కృతిక, సాహస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంతేగాక సంగీత విభావరి, ఫైర్‌వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి.
హోరాహోరీ ఖాయం..
రష్యాలో జరిగే ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హోరాహోరీ సమరం జరిగే అవకాశాలున్నాయి. బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, కోస్టారికా, పెరూ, ఉరుగ్వే, పనామా వంటి అమెరికా దేశాలు ట్రోఫీ కోసం సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు యూరప్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, మాజీ చాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌లతో సహా బెల్జియం, పోర్చుగల్, పోలండ్ ట్రోఫీపై కన్నేశాయి. దీంతో ఈసారి కూడా ఇరు ఖండాల జట్ల మధ్యే ప్రధాన పోరు జరిగే అవకాశాలున్నాయి.

Comments

comments