Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వాళ్లకు ఆస్తి పన్నులో ఐదు శాతం రాయితీ: కెటిఆర్

KTR

రంగారెడ్డి: పౌరుల్లో చిత్తశుద్ధి లేకుంటే ప్రభుత్వం ఎంత కృషి చేసినా ఫలితం రాదని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నాగోల్‌లో గురువారం జరిగిన “మన నగరం” కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నట్లే… కాలనీ, నగరాన్ని శుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్నవారికి ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. నీటి సంరక్షణ కోసం “జలం-జీవం” అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హరిత హారంలో కూడా ప్రజల భాగస్వామ్యం పెరగాలని సూచించారు. మొక్కలు పెంచేది సిఎం కోసమో, ప్రజాప్రతినిధుల కోసమో కాదని, చెట్ల పెంపకం వల్ల మొత్తం సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అన్ని రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి చిన్న పని జిహెచ్‌ఎంసి వాళ్లే వచ్చి చేయాలనుకోవడం తప్పు అన్నారు. వినూత్నమైన ఆలోచనలతో వ్యర్థాలను కూడా వినియోగంలోకి తేవాలని సూచించారు. పౌరులకు అవసరమైన సహాయం చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు చెల్లించే పన్నులకు ధర్మకర్తలని పొగిడారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఎంపిలు మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Comments

comments