Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సాగర్ నీటిలో మునిగి బాలుడు మృతి

 A Boy dies in Drowning in water

కొండమల్లెపల్లిః- నాగర్జున సాగర్ బ్యాక్ వాటర్‌ లో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగోమ్మ మండలం చిన్నమునిగల్ గ్రామ పంచాయతీలోని వైజాక్ కాలనీకి చెందిన జగ్గనాయక్ కుమారుడు తేజ (10) ఉదయం నాగర్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి చనిపోయాడు.అనంతరం మృత దేహన్ని 108 వాహనంలో దేవరకొండలోని ప్రభుత్వ దవఖానకు తరలించారు. జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ ప్రభుత్వ అస్పత్రికి వెళ్లి తేజ మృతదేహనికి నివాళులర్పించి తేజ కుటుంబ సభ్యులను ఓదార్చి వేంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో ఆయన దృష్టికి తీసుకెళ్లి బాధితుని కుటుంబానికి తక్షణమే రూ. లక్ష సహయంగా అందించే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో పాటు దేవరకొండ ఆర్డీవో లింగ్యానాయక్ ప్రభుత్వ దవఖానను సందర్శించి మృతుని కుటుంబానికి తక్షణ సహాయార్ధం రూ. పది వేలు అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు యం.ఏ సీరాజ్‌ఖాన్, ముక్కమళ్ల వెంకటయ్యగౌడ్, కొర్ర రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments