Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఆర్టీసి బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

A Man Dies in Road Accident In Suryapet

సూర్యాపేట : ఆర్టీసి బస్సు ఢీ కొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు కాలు విరిగి తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన సీత్ మందార్ (50) భార్య సీత్ సైదమ్మ (43)లు సూర్యాపేట మండలం కిన్నుయిపాలెంలో తమ సమీప బంధువు ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం సాయంత్రం వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యాపేటలో పని ఉంది అని చెప్పి తమ టీవీఎస్‌పై పాత బస్టాండ్ వైపు వెళ్లడానికి సితార హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు కోదాడ నుండి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్తూ రోడ్డు దాటుతున్న మందార్ టీవీఎస్ ఎక్సల్ ను ఢీ కొట్టింది.దీంతో మందార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య సైదమ్మకు ఎడమకాలు విరగడంతో పాటు తలకు, కుడి కాలుకి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పట్టణ ఎస్ఐ క్రాంతికుమార్ మృతుడి కుమారుడు నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బస్సుతో పాటు డ్రైవర్ నూనావత్ రాంకోటి, కండక్టర్ కొమ్మ సంపూర్ణను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Comments

comments