Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

మనస్థాపంతో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు

A Man Sucide Attempted In Yadadri District

మన తెలంగాణ/మోత్కూరు ః మనస్థాపం చెంది ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మద్యాహ్నం మోత్కూ రు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆత్మహ త్యాయత్నానికి పాల్పడిన యువకుడు బాసోజు ఉపేంద్రాచారి భార్య సంతోష తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.  తాము గత 8సంవత్సరాల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నామని,తమది కులాంతర వివా హం కావడంతో తన అత్తమామలు బాసోజు అంజయ్య- కళమ్మలు,తన బావలు ,మరిది  తమను ఇంట్లోకి రాని వ్వకుండా కుటుంబ బహిష్కరణ చేశారని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం తమను ఇంట్లోకి రానివ్వా లంటూ మహిళా సంఘాల నాయ కులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహిం చామని అప్పుడు  మా ట్లాడి సమస్యను పరిష్కరించు కుందామని చెప్పారని ,అందుకు విరుద్దంగా తమతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మహిళా సంఘాల నాయ కురాళ్ళపై, తమపై కేసులు నమోదు చేయిం చారని తెలిపారు. దీంతో నాభర్త  మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికే సెల్‌టవర్ ఎక్కాడని తెలిపింది. తమపై, మహిళా సంఘాల నాయకురాళ్ళపై పెట్టిన కేసులు ఎత్తివే యాలని, తమను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేసింది. పలుమార్లు న్యాయం చేస్తామని ఎస్‌ఐ యం. సత్యనారాయణ సెల్‌ఫోన్లో ఉపేంద్రా చారికి తెలిపి నప్పటికి అతను సెల్‌టవర్ దిగలేదు. చివరకు పోలీ సులు మాల మహానాడు సంఘం అధ్యక్షుడు బోడ బాబూ రావు సెల్‌ఫోన్లో బాధితుడితో మాట్లాడి పోలీ సుల పక్షాన హామీ ఇవ్వడంతో  భువన గిరి నుండి వచ్చి న ఫైర్ స్టేషన్ సిబ్బంది నాగరాజు, దేవేందర్ లు టవర్ ఎక్కి  మంచి నీటిని తాగించి బాధితుడిని కిందకు దిం చారు. ఎట్టకేలకు మూడు గంటల ఉత్కంఠకు తెరపడింది.

Comments

comments