Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

ధరణికి ఆధార్ అడ్డంకి!

ఆదిలో రైతులు అవగాహన లేమితో ఇతరుల ఆధార్‌కార్డులను సమర్పించారు
అవి సరిపోలకనే భూ రికార్డులను ధరణి వెబ్‌సైట్‌లో ఎక్కించడంలో ఇబ్బందులు
ఆయా గ్రామాలకు ఆధార్ కిట్లతో సిబ్బందిని పంపించి సరి చేయించాలని ప్రభుత్వం యోచన

farmers-passbook

హైదరాబాద్: ఆధార్ కార్డుపై గ్రామ ప్రజల్లో తొలి దినాల్లో సరైన అవగాహన లేకపోవడంతో చేసిన పొరపాట్లు ఇప్పు డు భూ రికార్డుల్లో సమస్యలకు కారణమవుతున్నాయి. ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా ‘ఇ కెవైసి’ పేరుతో ‘మీ సేవ’ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన వందరోజుల్లోనే ముగిసిపోయినా వాటిని వెబ్‌సైట్‌లో పొందుపర్చడంలో మాత్రం ఆరు నెలలుగా ఎదురవుతున్న ఇబ్బందులకు ఇదే కారణమవుతోంది. భూ రికార్డులు సక్రమంగానే ఉన్నా కంప్యూటర్ డాటాలో గతంలో పొందుపర్చిన ఆధార్ నెంబర్ సరైంది కాకపోవడంతో ‘ధరణి’ వెబ్‌సైట్‌కు సాంకేతిక చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆధార్ నెంబర్ అంటే టెలిఫోన్ నెంబర్‌లాంటిదేమోనని భావించిన కొద్దిమంది నిరక్షరాస్యులు అన్నదమ్ములవో, బంధువులలో, చుట్టుపక్కలవారివో ఆధార్ నెంబర్లు ఇవ్వడంతో ఆ ప్రకారమే భూ రికార్డుల్లో నమోదై ఇప్పుడు ఏ చిన్న మార్పు చేయడానికీ వీలు కాకుండా పోయింది. పట్టాదారు పాస్‌బుక్‌ల డాటా, భూ రికార్డుల్లో మార్పులు చేర్పులు, ఆధార్ వివరాలను నమోదు చేస్తు న్న సందర్భంలో వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్‌లో ఫోటో ‘మిస్‌మ్యాచ్’, ‘ఆధార్ వివరాలు సరిగ్గా లేవు’ లాంటి వార్నింగ్‌లు వస్తున్నాయి. భూముల సర్వే నెంబర్లు, తండ్రిపేరు, అడ్రస్ లాంటివన్నీ సక్రమంగానే అప్‌లోడ్ చేయగలుగుతున్నా ఆధార్ నెంబర్‌ను నమోదు చేయడంతోనే ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. పట్టాదారు పాస్‌బుక్ తయారీ సందర్భంగా ఈ విషయాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు తొలుత సక్రమంగా ఉన్నవాటిపై దృష్టి పెట్టారు. సమస్యాత్మకంగా ఉన్న భూముల వివరాలను చక్కదిద్దే క్రమంలో ఆధార్ లోపాలు వెలుగులోకి వచ్చాయి. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివాదానికి తావులేకుండా ఉన్నప్పటికీ వాటిని ‘ధరణి’ వెబ్‌సైట్‌లో పొం దు పర్చే సమయంలో ఆధార్ వివరాలు సరిపోకపోవడంతో అక్కడే బ్రేక్ పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆధార్ చిక్కులు ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా ‘ఆధార్ కిట్’లతో సిబ్బందిని పంపి వివరాల్లో మార్పులు చేర్పులు చేయడమా లేక గతంలో ఆధార్ కార్డు లేనట్లయితే కొత్తగా నమోదు చేయడమా అనే క్యాంపెయిన్‌ను చేపట్టాలని భావిస్తున్నారు. పాస్‌బుక్‌లలో తప్పులు చోటుకోడానికి ఇదే కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో ‘ఆధార్’ వెరిఫికేషన్ : డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ
పాస్‌బుక్‌ల ముద్రణ సందర్భంగా డాటాను క్రోడీకరించే సమయంలో పరిస్థితి సక్రమంగానే ఉన్నప్పటికీ ‘ధరణి’ వెబ్‌సైట్‌లో నమోదు చేసే సమయానికే ఆధార్ లోపాలు బయటపడ్డాయని, లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించిన తర్వాత వాస్తవం అర్థమైందని, ఈ లోపం ఇక్కడికే పరిమితం కాదని, ఇకపైన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ఆటంకంగా ఉంటుంది కాబట్టి వెంటనే చక్కదిద్దడానికి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతున్నారని డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ ‘మన తెలంగాణ’కు వివరించారు. ‘మిస్‌మ్యాచ్’లు ఉన్న ప్రతీ గ్రామానికి ఆధార్ బృందాలు వెళ్తాయని, లోపాలను సరిదిద్దుతాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రికార్డుల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని, అవసరమైతే జూన్ 20కల్లా పూర్తి చేయాల్సిన గడువును మరో పక్షం రోజులైనా పొడిగిస్తామని తెలిపారు. కానీ భూ రికార్డుల్లో, ఆధార్ వివరాలు, పేరు, చిరునామా, భూమి విస్తీర్ణం.. ఇలా ఏ అంశంలోనూ పొరపాటు లేకుండా

Comments

comments