Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అత్యాచారం కేసులో రెండు సంవత్సరాలకు పట్టుబడ్డ నిందితుడు

అరెస్టు చేసిన అంబర్‌పేట పోలీసులు 

Rape on Software Employee with Anesthesia in Pan

మన తెలంగాణ/అంబర్‌పేట:  అత్యాచారం కేసులు తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలక అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన కోమటి శ్రవణ్‌కుమార్ (49) గోల్నాక ప్రాంతానికి చెందిన వరసకు మరదలు అయ్యే మహిళ (39) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పేరుతో వేధించడంతో పాటు మాయ మాటలతో లోబరచుకున్నాడు. సదరు మహిళకు వివాహం అయిన తర్వాత కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ సంబంధం కొనసాగించాడు. ఈ నేపథ్యంలో అతని వేధింపులు భరించలేక 2016లో అంబర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదైంది. పొలీసులు దర్యాప్తు  చేపట్టేలోపు శ్రవణ్‌కుమార్ ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్ళిపోయాడు. పోలీసులు అన్ని అంతర్జాతీయ విమానశ్రయాల్లో వాంటెడ్  లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా పరారిలో ఉన్న నింధితుడు ఎట్టకేలకు అంతర్జాతీయ  విమానశ్రయ అధికారుల సహకారంతో గత శనివారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు పాటు రిమాండ్ విధించారు.

Comments

comments